News November 12, 2024
ట్రంప్ రాకతో USలో వాటికి పెరిగిన డిమాండ్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుతో అగ్రరాజ్యంలో అబార్షన్ పిల్స్‌కి డిమాండ్ పెరిగింది. ట్రంప్ గెలిచిన 24 గంటల్లోనే పిల్స్ కోసం 10K అభ్యర్థనలు వచ్చినట్టు ఎయిడ్ యాక్సెస్ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఇది రోజువారి డిమాండ్‌లో 17 రెట్లు అధికమని పేర్కొంది. గర్భవిచ్ఛిత్తి హక్కును నిషేధిస్తానని ట్రంప్ ప్రకటించడంతో అక్కడి ప్రజలు అబార్షన్ పిల్స్ కోసం తెగ ఆర్డర్ చేస్తున్నారు.
Similar News
News March 5, 2026
10 సార్లు సీఎం.. ఇక శకం ముగిసినట్లే!

బిహార్‌లో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రికార్డు నితీశ్ పేరిట ఉంది. ఏకంగా 10 సార్లు ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి 2000 సం.లో కేవలం 7 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2005, 10, 15 (2 సార్లు), 17, 20, 22, 24, 25లో CM కుర్చీ ఎక్కారు. OBCలు, మహిళల మద్దతుతో పాటు వివిధ పార్టీలతో పొత్తుల ద్వారా ఎక్కువ కాలం సీఎంగా కొనసాగారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్‌లో ఆయన శకం ముగిసినట్లే భావించాలి.
News March 5, 2026
ప్రపంచంలో రద్దీగా ఉండే జలసంధులు ఇవే..

వివిధ ఖండాల మధ్య ఉన్న జలసంధుల ద్వారా చమురు రవాణా సాగుతుంటుంది. ఇందులో మలక్కా జలసంధి అతి ముఖ్యమైనది. ఇండోనేషియా దీవుల్లో ఉండే ఈ సంధి ద్వారా రోజుకు 23.2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ సరఫరా అవుతుంది. ఆ తర్వాత ఇరాన్ దగ్గరలోని హార్ముజ్ (20.9 M), సౌతాఫ్రికా కింద ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ (9.1 M), ఈజిప్ట్ సూయిజ్ కెనాల్ (4.9 M), డానిష్ సంధి (4.9 M) ఉన్నాయి. తాజా యుద్ధంతో హార్ముజ్‌ను మూసివేశారు.
News March 5, 2026
హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

HYDలోని<


