News May 19, 2024
అనంతలో మొదలైన వజ్రాల వేట

AP: అనంతపురం జిల్లా వజ్రకరూరులో వజ్రాల వేట మొదలైంది. వర్షాలు పడుతుండటంతో ప్రజలు పొలాలను జల్లెడ పడుతున్నారు. అక్కడి పొలాలన్నీ వజ్రాలు వెతికే వారితో నిండిపోయాయి. కడప, మదనపల్లి, ధర్మవరం, ఆలూరు, గుంతకల్లు, గుత్తి ప్రాంతాల నుంచి వజ్రాలు వెతికేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా జూన్, జులైలో కురిసే వర్షాలకు ఇక్కడ రాళ్లను వెతకడానికి ప్రజలు వస్తుంటారు. చిన్న రాయి (వజ్రం) కూడా భారీ ధర పలుకుతుంది.
Similar News
News September 19, 2025
రైల్వేకు ‘మహిళా శక్తి’ని పరిచయం చేసిన సురేఖ

ఆడవాళ్లు రైలు నడుపుతారా? అనే ప్రశ్నలను, అడ్డంకులను దాటుకుని ఆసియాలోనే తొలి మహిళా లోకోపైలట్‌గా మారిన సురేఖా యాదవ్(మహారాష్ట్ర) పదవీ విరమణ పొందారు. ఆమె తన అసాధారణ ప్రయాణంలో ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 1988లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా మొదలైన ఆమె ప్రయాణం డెక్కన్ క్వీన్ రైళ్లను నడిపే వరకూ సాగింది. ఆమె ఉద్యోగ జీవితం భారతీయ రైల్వేలో మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిపోతుంది.
News September 19, 2025
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఒక ప్రాజెక్ట్ అసోసియేట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 3వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* NIT- వరంగల్ 2 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగలవారు సెప్టెంబర్ 23వరకు అప్లై చేసుకోవచ్చు.
News September 19, 2025
‘కల్కి-2’ నుంచి దీపిక ఔట్.. కారణాలివేనా?

‘కల్కి-2’ నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను <<17748690>>తీసేయడంపై<<>> నెట్టింట చర్చ జరుగుతోంది. ఆమె డిమాండ్స్ వల్లే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన టీమ్ మొత్తాన్ని (25 మంది) లగ్జరీ హోటల్లో ఉంచాలనడంతో పాటు 25% రెమ్యునరేషన్ పెంచాలని, రోజుకు 5-7గంటలే పనిచేస్తానని డిమాండ్ చేశారట. ఆమె రెమ్యునరేషన్ హైక్‌కు ఓకే చెప్పినా, షూటింగ్ టైమ్ తగ్గించడానికి మాత్రం మేకర్స్ ఒప్పుకోలేదని సినీవర్గాలు పేర్కొన్నాయి.