News May 19, 2024
అనంతలో మొదలైన వజ్రాల వేట

AP: అనంతపురం జిల్లా వజ్రకరూరులో వజ్రాల వేట మొదలైంది. వర్షాలు పడుతుండటంతో ప్రజలు పొలాలను జల్లెడ పడుతున్నారు. అక్కడి పొలాలన్నీ వజ్రాలు వెతికే వారితో నిండిపోయాయి. కడప, మదనపల్లి, ధర్మవరం, ఆలూరు, గుంతకల్లు, గుత్తి ప్రాంతాల నుంచి వజ్రాలు వెతికేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా జూన్, జులైలో కురిసే వర్షాలకు ఇక్కడ రాళ్లను వెతకడానికి ప్రజలు వస్తుంటారు. చిన్న రాయి (వజ్రం) కూడా భారీ ధర పలుకుతుంది.
Similar News
News November 10, 2025
ఢిల్లీ పేలుడు.. విచారణకు ఆదేశించిన హోంమంత్రి

ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, ఢిల్లీ సీపీతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇప్పటికే NSG, NIA టీమ్స్ ఘటనాస్థలికి చేరుకున్నాయి. అటు పేలుడులో 8 మంది మరణించగా, 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. కార్లు, దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎర్రకోట వద్ద భీతావహ వాతావరణం నెలకొంది.
News November 10, 2025
రహదారి పక్కన ఇంటి నిర్మాణానికి నియమాలు

రహదారి పక్కనే ఇల్లు కట్టుకుంటే, ఆ దారి కొలతకు ఇంటి పొడవు రెండింతల కంటే ఎక్కువ ఉండకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తారు. ఈ నియమం ఇంటికి, బయటి శక్తి ప్రవాహానికి మధ్య సమతుల్యతను నెలకొల్పుతుందని అంటారు. ‘ఇంటి పొడవు అధికంగా ఉంటే.. అది రోడ్డు నుంచి వచ్చే చంచల శక్తిని ఎక్కువగా ఆకర్షించి, ఇంట్లో స్థిరత్వాన్ని తగ్గిస్తుంది. గృహంలో ప్రశాంతత ఉండాలంటే ఈ నియమం పాటించాలి’ అని తెలుపుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 10, 2025
19న పుట్టపర్తికి PM మోదీ రాక: CBN

AP: సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19న PM మోదీ పుట్టపర్తికి రానున్నారని CM CBN తెలిపారు. అలాగే 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వస్తారన్నారు. ఈ నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంత్రుల కమిటీ అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. కాగా 65 ప్రత్యేక రైళ్లతో పాటు ఈనెల 13 నుంచి డిసెంబర్ 1 వరకు 682 రైళ్లు పుట్టపర్తికి రైల్వే శాఖ నడుపనుందని అధికారులు వివరించారు.


