News April 28, 2024

ఆపరేషన్ ఆపేసి దోశ తినడానికి వెళ్లిన డాక్టర్!

image

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ డాక్టర్ వైద్య వృత్తికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు. చేయి విరిగిన ఓ బాలికకు ఆపరేషన్ చేస్తూ మధ్యలో ఆపేశాడు. ఎందుకంటే ఆయన గారికి ఆకలేసిందట. మసాలా దోశ తినొస్తానని వెళ్లి.. 2 గంటల తర్వాత వచ్చి ఆపరేషన్ పూర్తి చేశాడు. ఆ బాలికకు నయం కాకపోగా వేళ్లు వంకర పోయాయి. దీంతో బాలికకు వేరే ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆ వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Similar News

News November 5, 2024

నా వ్యాఖ్యలు బాధపెడితే క్షమించండి: కస్తూరి

image

తాను చేసిన <<14525601>>వివాదాస్పద<<>> వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తమిళ నటి కస్తూరి ప్రకటన విడుదల చేశారు. ‘రెండ్రోజులుగా నాకు బెదిరింపులు వస్తున్నాయి. నేను నిజమైన జాతీయవాదిని. కుల, ప్రాంతీయ భేదాలకు నేను అతీతం. తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉంది. నేను మాట్లాడింది నిర్దిష్ట వ్యక్తుల గురించి మాత్రమే. ఎవరినైనా బాధపెడితే క్షమించండి. నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

News November 5, 2024

అక్టోబర్ మాసం: దేశంలో 4లక్షల కార్ల విక్రయం

image

అక్టోబర్‌లో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దసరా, దీపావళి పండుగలు ఉండటంతో ప్రజలు భారీగా ఫోర్ వీలర్స్ కొనుగోలు చేశారు. ఒక్క నెలలోనే దేశంలో 4,01,447 కార్ల అమ్మకం జరిగింది. వీటిలో మారుతీ సుజుకి అధికంగా 1,59,591 కార్లను విక్రయించింది. వీటి తర్వాత హుండాయ్(55,568), మహీంద్రా (54,504), టాటా మోటార్స్ (48,131), టయోటా (30,845), కియా మోటార్స్(28,545) ఉన్నాయి.

News November 5, 2024

బిర్యానీ తిని యువతి మృతి

image

TG: కొన్ని రోజుల క్రితం HYDలో మోమోస్ తిని ఓ మహిళ మరణించిన ఘటన మరవకముందే మరో విషాదం జరిగింది. నిర్మల్ జిల్లాలో బిర్యానీ తిని ఫుడ్ పాయిజన్‌తో యువతి మరణించింది. ఈ నెల 2న బోథ్‌కు చెందిన 15-20 మంది నిర్మల్‌లోని గ్రిల్ నైన్ రెస్టారెంట్‌లో చికెన్ మండీ బిర్యానీ తిన్నారు. ఆ వెంటనే వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఇవాళ పూల్ కలి బైగా(19) మృతి చెందింది.