News January 3, 2025

ఫ్రీ స్కీములతో ఎకానమీ ‘శక్తి’హీనం

image

శక్తికి మించి వెల్ఫేర్ స్కీములతో శక్తివిహీనులవ్వడం ఖాయమనేందుకు కర్ణాటక నిదర్శనంగా మారిందని నిపుణులు అంటున్నారు. 5 గ్యారంటీల అమలుకు అష్టకష్టాలు పడుతోంది. తలకు మించి అప్పులు చేస్తోంది. Q4లో ప్రతివారం రూ.4K CR చొప్పున రూ.48K CR అప్పు చేయనుంది. FY25లో లక్షకోట్లు అప్పు చేస్తుందని అంచనా. 5 గ్యారంటీలకే రూ.60K CR ఖర్చు చేస్తున్న ప్రభుత్వం డబ్బులు రాబట్టేందుకు తిరిగి జనాల పైనే ఛార్జీల భారం వేస్తోంది.

Similar News

News January 5, 2025

గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన కార్ల్‌సన్

image

ప్రపంచ నంబర్-1 చెస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ గర్ల్‌ఫ్రెండ్‌ ఎల్లా విక్టోరియా మలోన్‌ను పెళ్లి చేసుకున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో కుటుంబ సభ్యులు, కొద్ది‌మంది బంధువుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకను నెట్‌ఫ్లిక్స్ సినీ బృందం చిత్రీకరించింది. ఇటీవల కార్ల్‌సన్ ఎనిమిదో సారి వరల్డ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్‌గా నిలవగా, టైటిల్ షేరింగ్ విషయంపై కాంట్రవర్సీ నడిచిన విషయం తెలిసిందే.

News January 5, 2025

స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ గడువు పెంపు

image

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల గడువును మార్చి 31 వరకు పొడిగించారు. సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ-పాస్ వెబ్‌సైటులో దరఖాస్తు చేసేందుకు గతంలో గడువు విధించగా, చాలా మంది అప్లై చేయలేదు. 7.44 లక్షల మంది రెన్యువల్ విద్యార్థుల్లో 4 లక్షల మంది, 4.83 లక్షల మంది కొత్త వారిలో కేవలం 1.39 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు.

News January 5, 2025

ప్లేయర్ల భవిష్యత్తుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు

image

రోహిత్, కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ కావాలని వస్తున్న డిమాండ్లపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లేయర్ల భవిష్యత్తుపై ఏమీ మాట్లాడను. వారిలో తపన, నిబద్ధత ఉంటే వారే భారత్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తారు. డ్రెస్సింగ్ రూమ్‌ను సంతోషంగా ఉంచడానికి నేను ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉంటాను. వంద టెస్టులు ఆడినా, ఒక్క మ్యాచూ ఆడకపోయినా ప్లేయర్లను సమానంగా చూస్తా’ అని గౌతీ చెప్పారు.