News January 3, 2025
ఫ్రీ స్కీములతో ఎకానమీ ‘శక్తి’హీనం
శక్తికి మించి వెల్ఫేర్ స్కీములతో శక్తివిహీనులవ్వడం ఖాయమనేందుకు కర్ణాటక నిదర్శనంగా మారిందని నిపుణులు అంటున్నారు. 5 గ్యారంటీల అమలుకు అష్టకష్టాలు పడుతోంది. తలకు మించి అప్పులు చేస్తోంది. Q4లో ప్రతివారం రూ.4K CR చొప్పున రూ.48K CR అప్పు చేయనుంది. FY25లో లక్షకోట్లు అప్పు చేస్తుందని అంచనా. 5 గ్యారంటీలకే రూ.60K CR ఖర్చు చేస్తున్న ప్రభుత్వం డబ్బులు రాబట్టేందుకు తిరిగి జనాల పైనే ఛార్జీల భారం వేస్తోంది.
Similar News
News January 18, 2025
నితీశ్‌కు నిరాశ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన తెలుగు తేజం నితీశ్ రెడ్డికి నిరాశ ఎదురైంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. పేస్ ఆల్‌రౌండర్లలో పాండ్య వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. దీంతో తెలుగు క్రికెట్ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. మరోవైపు పేసర్ సిరాజ్, బ్యాటర్ తిలక్ వర్మను కూడా జట్టులోకి తీసుకోలేదు. దీంతో తెలుగు స్టేట్స్ నుంచి CTలో ప్రాతినిధ్యం లేకుండాపోయింది.
News January 18, 2025
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కూ అదే జట్టు.. కానీ
ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన 15 మంది సభ్యుల <<15185531>>జట్టే<<>> ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లోనూ పాల్గొంటుందని కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అగార్కర్ తెలిపారు. కానీ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా వస్తారని వెల్లడించారు. అయితే తొలి రెండు వన్డేలకు బుమ్రాకు రెస్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత జరిగే మూడో వన్డే నుంచి అతడు జట్టులోకి వచ్చి, CTలోనూ పాల్గొంటారని తెలుస్తోంది.
News January 18, 2025
అనుమానాలు పటాపంచలు.. CTలో బుమ్రా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అనుమానమేనన్న వార్తలకు తెరపడింది. ఇవాళ అతని పేరును సెలక్టర్లు ప్రకటించారు. దీంతో స్టార్ బౌలర్ కోలుకున్నట్లు పరోక్షంగా చెప్పినట్లయింది. BGTలో భారత బౌలింగ్ దళాన్ని బుమ్రా ఒంటి చేత్తో ముందుకు నడిపించిన విషయం తెలిసిందే. ట్రోఫీ కోల్పోయినప్పటికీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నారు.