News March 21, 2024
ఫెడ్ రేట్ల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ల జోరు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 750 పాయింట్లకుపైగా లాభపడి 72,854 వద్ద, నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 22068 వద్ద ట్రేడవుతున్నాయి. BPCL, NTPC, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకపోవడం, ఈ ఏడాది మూడుసార్లు వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని సూచనలు వచ్చిన నేపథ్యంలో మార్కెట్లకు జోష్ వచ్చింది.
Similar News
News April 14, 2025
దిగ్గజ బ్రిటిష్ నటి కన్నుమూత

దిగ్గజ బ్రిటిష్ నటి జీన్ మార్ష్(90) కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా డిమెన్షియాతో బాధపడుతున్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని సన్నిహితులు తెలిపారు. బ్రిటిష్ డ్రామా ‘అప్స్టెయిర్స్, డౌన్స్టెయిర్స్’కి 1975లో ఆమె ప్రతిష్ఠాత్మక ఎమ్మీ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 2012లో జీన్కు ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ గౌరవం దక్కింది.
News April 14, 2025
రక్తమోడిన రోడ్లు.. ఎనిమిది మంది మృతి

AP: కడప(D) ఒంటిమిట్ట(M) నడింపల్లి వద్ద బస్సు-బొలెరో ఢీకొన్న ఘటనలో జీపులోని ముగ్గురు, నెల్లూరు(D) రాపూరులోని తిక్కనవాటిక పార్కు వద్ద కారు ఢీకొట్టడంతో వడ్లు ఎండబెట్టుకుంటున్న ఇద్దరు రైతులు చనిపోయారు. TG జనగామ(D) రాఘవపూర్ వద్ద లారీని కారు ఢీకొట్టడంతో కారు డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు చనిపోయారు. అటు RR(D) దామరగిద్ద వద్ద కారు డోర్లు లాక్ పడటంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు.
News April 14, 2025
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్

AP: వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్రం ఈ చట్టం రూపొందించిందని పిటిషన్లో పేర్కొంది. పార్లమెంట్లో కూడా ఆ పార్టీ బిల్లును వ్యతిరేకించింది.. కాగా మైనార్టీ సమాజానికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ ఇటీవల హామీ ఇచ్చారు.