News March 21, 2024
ఫెడ్ రేట్ల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ల జోరు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 750 పాయింట్లకుపైగా లాభపడి 72,854 వద్ద, నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 22068 వద్ద ట్రేడవుతున్నాయి. BPCL, NTPC, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హిందాల్‌కో షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకపోవడం, ఈ ఏడాది మూడుసార్లు వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని సూచనలు వచ్చిన నేపథ్యంలో మార్కెట్లకు జోష్ వచ్చింది.
Similar News
News March 5, 2026
విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.
News March 5, 2026
సెమీస్.. భారత్ భారీ స్కోర్

T20WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా 253/7 స్కోర్ చేసింది. అభిషేక్(9), సూర్య(11) విఫలమవగా, సంజూ శాంసన్ 89, ఇషాన్ 39, శివమ్ దూబే 43, తిలక్ 21, హార్దిక్ 27 రన్స్‌తో రాణించారు. విల్ జాక్స్, రషీద్ చెరో 2, ఆర్చర్ ఒక వికెట్ తీశారు. విజయం కోసం ఇంగ్లండ్ 254 పరుగులు చేయాలి. ఇవాళ గెలిచిన జట్టు ఈ నెల 8న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడుతుంది.
News March 5, 2026
బాలీవుడ్ మూవీలా పశ్చిమాసియా పాలిటిక్స్!

పశ్చిమాసియా జియో పాలిటిక్స్ బాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నాయంటూ <<18418395>>హర్ష్ గోయెంకా<<>> ట్వీట్ చేశారు. ‘‘ఇజ్రాయెల్ వెంట IND ఉంది. USతో ఇజ్రాయెల్, పాక్‌తో US, ఇరాన్ వెంట PAK ఉంది. అయితే IND-PAK శత్రువులుగానే ఉన్నాయి. ఇది ‘ముఖద్దర్ కా సికందర్’ మూవీని గుర్తు చేస్తోంది. రేఖను అంజాద్ ప్రేమిస్తారు. అమితాబ్‌ను రేఖ, రాఖీని అమితాబ్, వినోద్‌ను రాఖీ లవ్ చేస్తారు. అయితే అంజాద్, అమితాబ్ శత్రువులే’’ అని పేర్కొన్నారు.


