News December 5, 2024

నిజాయితీకి ప్రతిరూపం: 33 ఏళ్లలో 57 బదిలీలు

image

‘4ఏళ్ల సర్వీసులో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్‌ఫర్లు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నమాట’ విక్రమార్కుడు మూవీలో ఈ డైలాగ్ చాలా ఫేమస్. నిజజీవితంలోనూ అలాంటి ఆఫీసర్ ఉన్నారు. IAS అశోక్ ఖేమ్కా 33ఏళ్ల కెరీర్‌లో 57వ సారి బదిలీ అయ్యారు. 2025 APR 30న రిటైర్డ్ కానున్న ఆయన తాజాగా హరియాణా రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఈయన నిజాయితీగా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

Similar News

News January 14, 2025

పన్ను వసూళ్లలో 15.88 శాతం వృద్ధి

image

FY2024-25లో ఈ నెల 12 వరకు రూ.16.89 లక్షల కోట్లు ఇన్‌కమ్ ట్యాక్స్ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. FY2023-24లో ఇదే సమయంతో పోలిస్తే 15.88 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. ఇందులో వ్యక్తిగత ఆదాయ పన్ను రూ.8.74 లక్షల కోట్లు, కార్పొరేట్ పన్ను రూ.7.68 లక్షల కోట్లు, సెక్యూరిటీ లావాదేవీల పన్ను రూ.44,538 కోట్లు, ఇతర పన్నులు రూ.2,819 కోట్లు ఉన్నాయంది.

News January 14, 2025

కరీంనగర్‌కు కౌశిక్ రెడ్డి తరలింపు

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కరీంనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తారనే సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరికాసేపట్లో ఆయనను జడ్జి ముందే ప్రవేశపెట్టే అవకాశముంది. మరోవైపు కౌశిక్‌ను అరెస్ట్ చేయడం అక్రమమని హరీశ్ రావు అన్నారు.

News January 14, 2025

నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను భర్త చూసుకుంటున్నారు: పీవీ సింధు

image

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆస్పత్రిలో ఉన్న వీడియో చూసినప్పుడు ఎమోషనల్‌ అయినట్లు పీవీ సింధు చెప్పారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలన్నారు. ‘నా ఆదాయం, పన్నుల వ్యవహారాన్ని పేరెంట్స్ చూసుకుంటున్నారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను భర్త దత్తసాయి మేనేజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు నాకు ఎలాంటి ఆర్థిక సమస్యలు రాలేదు. అందుకు నేను సంతోషిస్తున్నా’ అని పేర్కొన్నారు.