News August 21, 2024

మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి: జగన్

image

AP: అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు <<13910421>>ఘటనలో<<>> మరణాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని మాజీ CM జగన్ ట్వీట్ చేశారు. గత YCP ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా తమ పార్టీ ఉంటుందని, ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని కోరారు.

Similar News

News September 15, 2024

వరద బాధితులకు భారీ విరాళం

image

AP: రాష్ట్రంలో వరద బాధితులకు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు రూ.7.70 కోట్ల విరాళం అందజేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చెక్కు అందజేసినట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు YVB రాజేంద్ర తెలిపారు. వరద బాధితుల కోసం రాష్ట్రంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఒక నెల గౌరవ వేతనం ఇచ్చామన్నారు.

News September 15, 2024

రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసిన నాని మూవీ

image

వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు దాటినట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఇప్పుడు సరిపోయిందంటూ రాసుకొచ్చింది. గత నెల 29న థియేటర్లలో విడుదలైన ‘సరిపోదా శనివారం’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మూవీలో సూర్య నటన, జేక్స్ బెజోయ్ మ్యూజిక్‌కు సినీ ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.

News September 15, 2024

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

image

TG: ఫార్మాసిటీ ప్రాజెక్టును కొనసాగిస్తున్నారో? లేదో స్పష్టత ఇవ్వాలని కోరుతూ CM రేవంత్ రెడ్డికి KTR లేఖ రాశారు. ‘ప్రాజెక్టును రద్దు చేస్తే భూములు ఇచ్చిన రైతులకు తిరిగి వారి భూములు అప్పగించండి. ఆ భూముల్ని ఇతర అవసరాలకు వాడితే చట్టపరంగా సమస్యలు తప్పవు. అంతర్జాతీయంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్‌లో HYDను నం.1గా చేసేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టాం. రాజకీయాల కోసం TG యువతకు నష్టం చేయొద్దు’ అని లేఖలో పేర్కొన్నారు.