News January 26, 2025

రైతుకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం అదే: రేవంత్

image

TG: భూమికి విత్తనానికి ఉండే బలమైన అనుబంధం రైతుకు కాంగ్రెస్ పార్టీకి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్(ని) చంద్రవంచ గ్రామంలో నూతన పథకాల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ముందు నుంచీ రైతు పక్షపాతిగా ఉందని చెప్పారు. వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయాన్ని పండగలా మారుస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు.

Similar News

News February 20, 2025

రాత్రిపూట వీటిని తింటున్నారా?

image

రాత్రి పూట కొన్ని ఆహార పదార్థాల జోలికి పోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ, సోడా, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తినకూడదు. ఇవి తింటే సరిగ్గా నిద్రపట్టదు. స్వీట్లు, చాక్లెట్లు తినడం మంచిది కాదు. పరోటా, బంగాళదుంపల జోలికి వెళ్లొద్దు. డీప్ ఫ్రై, స్పైసీ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. సిట్రస్ పండ్లు, పచ్చి ఉల్లిపాయలు తింటే కడుపులో మంట, ఉబ్బరం, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.

News February 19, 2025

TGలో త్వరలో ఉప ఎన్నికలు: బండి సంజయ్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. అందుకే రహస్య సమావేశాలు పెడుతున్నారు. రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. 10 స్థానాల్లో 7 సీట్లు బీజేపీ గెలుస్తుంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

News February 19, 2025

CT తొలి మ్యాచ్.. పాకిస్థాన్ ఓటమి

image

CT-2025 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన NZ 5 వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. 321 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 47.2ఓవర్లకు 260 పరుగులు చేసి ఆలౌటైంది. బాబార్ ఆజమ్, కుష్‌దిల్ అర్ధశతకాలు చేశారు. విలియమ్, శాంట్నర్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. 23న భారత్‌తో జరిగే మ్యాచ్‌లోనూ పాక్ ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.

error: Content is protected !!