News September 12, 2024
‘అలసిపోయా’ అంటూ కుమార్తెలకు మలైకా తండ్రి ఫోన్
నటి మలైకా అరోరా తండ్రి అనిల్ కుల్దీప్ మెహతా ఆత్మహత్య చేసుకునే ముందు కుమార్తెలైన మలైకా అరోరా, అమృతా అరోరాకు చివరిగా ఫోన్ కాల్ చేసినట్లు సమాచారం. ‘అనారోగ్యంతో బాధపడుతున్నా. నేను పూర్తిగా అలసిపోయా’ అని కుమార్తెలకు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అటు తండ్రి మరణం తమ కుటుంబాన్ని ఎంతో బాధిస్తోందని మలైకా అరోరా సోషల్ మీడియాలో ఎమోషనల్ <<14079653>>పోస్ట్ <<>>చేశారు.
Similar News
News October 6, 2024
యజమానిని బతికించిన శునకం
కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. US వాషింగ్టన్‌లోని స్టీవెన్స్ కౌంటీ అటవీ ప్రాంతంలో ఉండే 84 ఏళ్ల వృద్ధుడి దగ్గర గీత అనే పెంపుడు కుక్క ఉంది. గత నెల 25న అతను కుప్పకూలడంతో గీత సాయం కోసం వెతికింది. అప్పుడే ఓ అధికారి అటుగా రాగా గీతను చూసి యజమాని కోసం వెతికినా కనిపించలేదు. కుక్కను అనుసరిస్తూ వెళ్లగా ఓ ఇంట్లో పడిపోయిన వృద్ధుడిని చూసి అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆస్పత్రికి పంపించారు.
News October 6, 2024
ఫోన్ రాగానే ప్రకాశ్ రాజ్ వదిలేసి వెళ్లిపోయారు: దర్శకుడు
ప్రకాశ్ రాజ్ షూటింగ్ నుంచి వెళ్లిపోయిన అంశంపై తమిళ డైరెక్టర్ వినోద్ మరింత స్పష్టతనిచ్చారు. ‘గత నెల 30న 1000మంది జూనియర్ ఆర్టిస్టులతో సీన్ చేస్తున్నాం. వేరే ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ రాగానే ప్రకాశ్ మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఏం చేయలేక మొత్తం షెడ్యూల్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. చాలా నష్టం వాటిల్లింది’ అని పేర్కొన్నారు. మరోవైపు నెట్టింట ‘జస్ట్ ఆస్కింగ్’ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
News October 6, 2024
తప్పనిసరిగా వేసుకోవాల్సిన టీకాలివే
టీకాలు రోగ నిరోధక శక్తిని పటిష్ఠం చేస్తాయనే విషయం అందరికీ తెలుసు. అయితే కేవలం చిన్నపిల్లలే కాదు టీనేజర్ల నుంచి వృద్ధుల వరకు తప్పనిసరిగా వేసుకోవాల్సిన టీకాలు కొన్ని ఉన్నాయి. టీడాప్, చికెన్ పాక్స్, జోస్టర్, హెపటైటిస్ బి, ఫ్లూ టీకా, నీమోకొకల్ టీకా, ఎంఎంఆర్ టీకా, హెపటైటిస్ ఏ, మెనింగోకొకల్ టీకాలు, టైఫాయిడ్ వ్యాక్సిన్, హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ టీకాలన్నీ వైద్యుల సూచనల మేరకే తీసుకోవాలి. >SHARE