News March 22, 2024

దేశంలో మరింత తగ్గనున్న సంతానోత్పత్తి రేటు!

image

దేశంలో సంతానోత్పత్తి రేటు మరింత తగ్గనున్నట్లు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం తెలిపింది. 1950లో 6.2గా ఉన్న ఫెర్టిలిటీ రేటు 2021 నాటికి 2 కంటే దిగువకు పడిపోయిందని పేర్కొంది. 1950లో సగటున స్త్రీలలో టోటల్ ఫెర్టిలిటీ రేటు 4.5 కంటే ఎక్కువగా ఉందని, అది 2021లో 2.2కి తగ్గిందని వివరించింది. సంతానోత్పత్తి రేటు 2050లో 1.29కి, 2100 నాటికి 1.04కి పడిపోవచ్చని అంచనా వేసింది.

Similar News

News October 2, 2024

ఇజ్రాయెల్‌కు అమెరికా సపోర్ట్.. కారణాలివే!

image

చాలా ఏళ్లుగా ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ఉంటోంది. 1948లో తొలిసారిగా ఇజ్రాయెల్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించింది అమెరికానే. 1967లో పశ్చిమాసియాపై రష్యా ఆధిపత్యం పెరిగిపోకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంది. దీంతో అమెరికా దృష్టిని ఇజ్రాయెల్ ఆకర్షించింది. మిడిల్ ఈస్ట్‌పై పట్టుకు ఇజ్రాయెల్ తమకు ఉపయోగపడుతుందని స్నేహబంధం కొనసాగిస్తూ వస్తోంది. అలాగే అమెరికాలో యూధులు రాజకీయంగా చాలా ప్రభావం చూపగలరు.

News October 2, 2024

న్యూజిలాండ్ కెప్టెన్‌గా టామ్ లాథమ్

image

న్యూజిలాండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ తప్పుకున్నారు. అతని స్థానంలో బ్యాటర్ టామ్ లాథమ్ కెప్టెన్‌గా నియామకం అయ్యారు. అక్టోబర్ 16 నుంచి INDతో జరిగే 3 మ్యాచుల టెస్ట్ సిరీస్ నుంచి లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. IND, NZ మధ్య OCT 16 నుంచి బెంగళూరులో తొలి టెస్ట్, 24 నుంచి పుణేలో రెండో టెస్ట్, నవంబర్ 1 నుంచి ముంబైలో మూడో టెస్ట్ జరగనుంది.

News October 2, 2024

ఆ కార్మికుల్ని తిరిగి తీసుకుంటాం: స్టీల్ ప్లాంట్ యాజమాన్యం

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ED ఆఫీస్ దగ్గర నిన్న కాంట్రాక్ట్ కార్మికులు చేసిన <<14241454>>ధర్నాకి<<>> యాజమాన్యం దిగొచ్చింది. తొలగించిన 4,290 మంది కాంట్రాక్ట్ కార్మికులకు బయోమెట్రిక్ గేట్ పాసులు యథావిధిగా కొనసాగిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. యాజమాన్యం లిఖిత పూర్వకంగా తమకు హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు వెల్లడించారు.