News March 22, 2024
దేశంలో మరింత తగ్గనున్న సంతానోత్పత్తి రేటు!
దేశంలో సంతానోత్పత్తి రేటు మరింత తగ్గనున్నట్లు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం తెలిపింది. 1950లో 6.2గా ఉన్న ఫెర్టిలిటీ రేటు 2021 నాటికి 2 కంటే దిగువకు పడిపోయిందని పేర్కొంది. 1950లో సగటున స్త్రీలలో టోటల్ ఫెర్టిలిటీ రేటు 4.5 కంటే ఎక్కువగా ఉందని, అది 2021లో 2.2కి తగ్గిందని వివరించింది. సంతానోత్పత్తి రేటు 2050లో 1.29కి, 2100 నాటికి 1.04కి పడిపోవచ్చని అంచనా వేసింది.
Similar News
News September 9, 2024
ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ ఉందని అధికారులు వెల్లడించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను అలర్ట్ చేశారు. రేపు ఉదయం 11.30 గంటల వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
News September 9, 2024
హరియాణాలో ఆప్ ఒంటరి పోరు
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు విఫలమవ్వడంతో ఒంటరిగా పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 90 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 20 మందితో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఆప్ 10 సీట్లు కోరగా, 5 నుంచి 6 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది.
News September 9, 2024
జగన్ చేసిన అప్పు వల్ల ఇప్పుడు నాకు ఇచ్చేవాళ్లు లేరు: సీఎం చంద్రబాబు
AP: విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలైన భవానీపురం, ఊర్మిలానగర్‌లో CM చంద్రబాబు మరోసారి పర్యటించారు. అక్కడ ప్రజలతో మాట్లాడారు. ‘ప్రభుత్వానికి కూడా ఇబ్బందులున్నాయి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్ రూ.10.50 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లారు. నేను ఇప్పుడు అప్పు అడిగినా ఇచ్చేవాళ్లు లేరు. వరద తీవ్రత వల్ల అందరికీ పూర్తిగా సాయం చేయలేకపోయాం. నష్టపోయిన అందరికీ న్యాయం చేస్తాం’ అని తెలిపారు.