News March 21, 2024

వలసల పర్వం మొదలైంది.. పార్టీలకు లాభం చేకూరేనా? – 3/3

image

ఈ చేరికలు కాంగ్రెస్‌కు బలం చేకూరుస్తాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీలోనూ అదే స్థాయి చేరికలు ఉంటున్నాయి. రాజస్థాన్‌లో జోధ్‌పుర్‌కు చెందిన 15 మంది కాంగ్రెస్ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. కేరళలో కాంగ్రెస్ కీలక నేత మహేశ్వరన్ నాయర్ సహా మధ్యప్రదేశ్‌లో 8 మంది ఇటీవల హస్తాన్ని వీడి కమలాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పోరు ఆసక్తిగా మారనుంది.

Similar News

News April 17, 2026

ఉత్తర, దక్షిణాది మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు: కిషన్ రెడ్డి

image

డీలిమిటేషన్‌పై ఉత్తరాది, దక్షిణాది మధ్య గొడవలు సృష్టించాలని విపక్షాలు చూస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో విమర్శించారు. 2 ప్రాంతాల మధ్య యుద్ధం వస్తుందంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని మోదీ స్పష్టం చేశారని గుర్తు చేశారు. మరోవైపు పార్లమెంటులో నిన్న BJP MP తేజస్వీ సూర్య TG ప్రజలను అవమానించేలా మాట్లాడలేదని తెలిపారు.

News April 17, 2026

పరుచూరి చెప్పిన జీవిత సూత్రం!

image

అతి మంచితనం, మొహమాటంతో ‘నో’ చెప్పలేకపోవడం వల్ల జీవితంలో అనేక చిక్కులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాటిచ్చి ఇబ్బందుల్లో పడేవారు చాలామంది. దీనిపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరికైనా మాట ఇచ్చేముందు పదిసార్లు ఆలోచించాలి. నోరు విప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమయానుకూలంగా NO చెప్పడం నేర్చుకోండి’ అని ఆయన సూచించారు.

News April 17, 2026

దేవుడి కంటే BCCI వద్దే ఎక్కువ డబ్బు.. అయినా: లలిత్ మోదీ

image

భారత్‌లో ఉన్న స్టేడియాలపై IPL ఫౌండర్ లలిత్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. BCCI వద్ద దేవుడి కంటే ఎక్కువ డబ్బు ఉందని, అయినా స్టేడియాల దుస్థితి మారట్లేదని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. BCCI వాటిని కూల్చేసి కొత్తవి నిర్మించాలని తెలిపారు. ఇక 2030 నాటికి IPLలో ఒక్కో అగ్రశ్రేణి ఆటగాడు రూ.150CR వరకు సంపాదిస్తారని జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఆటగాళ్లు దేశ జట్టు కంటే IPLకే ప్రాధాన్యతనిస్తారన్నారు.