News March 9, 2025
కాసేపట్లో ఫైనల్.. భారత జట్టు ఇదేనా?

మరికొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీ మహా సంగ్రామానికి తెర లేవనుంది. మ.2.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో భారత్ అదే జట్టుతో బరిలోకి దిగుతుందా? లేక ఏమైనా కీలక మార్పులుంటాయా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ‘NDTV’ ప్రకారం ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఇది. రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, హార్దిక్, అక్షర్, జడేజా, కుల్దీప్/సుందర్, షమీ, వరుణ్.
దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి.
Similar News
News March 17, 2025
మీ పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు తింటున్నారా?

చాక్లెట్ల నుంచి పిల్లలను వేరు చేయలేం. వాటిని సాధించేదాక వాళ్లు చేసే అల్లరి అంతాఇంతా కాదు. అలా అని ఒకటితో సరిపెట్టరు. ఇలా ఎక్కువగా చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోవడంతో పాటు వాటికి రంధ్రాలు ఏర్పడే ఆస్కారం ఉంది. అలాగని వాటిని తినకుండా ఉంచలేం. కాబట్టి రాత్రి పడుకునే ముందు వారితో బ్రష్ చేయిస్తే పళ్ల మధ్య అతుక్కుపోయిన చాక్లెట్ బయటికి వస్తుంది. దీంతో 10 గంటల వరకూ పళ్లకు రక్షణ కలుగుతుంది.
News March 17, 2025
నేడు అసెంబ్లీలోకి చరిత్రాత్మక బిల్లులు

నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. SCవర్గీకరణకు చట్టబద్ధతతో పాటు BCలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు శాసనసభ ముందుకు రానుంది. వీటిపై సభలో నేడు, రేపు ప్రత్యేక చర్చ జరగనుంది. ఎస్సీ వర్గీకరణకు షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. కులగణన సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ప్రకటించింది. ప్రస్తుతం BCలకు 29శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
News March 17, 2025
IPL: RRతో మ్యాచ్‌కు SRH జట్టు ఇదేనా?

IPL 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌తో తలపడనుంది. ఈ నెల 23న జరిగే ఈ మ్యాచులో బరిలోకి దిగే తుది జట్టును ESPN క్రిక్‌ఇన్ఫో అంచనా వేసింది. ముల్డర్, మెండిస్, జంపాను పరిగణనలోకి తీసుకోలేదు. జట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్, అభినవ్ మనోహర్, కమిన్స్ (C), హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మహ్మద్ షమీ. జట్టు అంచనాపై మీ కామెంట్.