News February 5, 2025
‘హరిహర వీరమల్లు’ ఆఖరి షెడ్యూల్ ప్రారంభం

పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ పార్ట్-1 షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈరోజు నుంచి మూవీ ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. పవన్ త్వరలోనే షూటింగ్‌లో చేరనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకూ జరిగే ఈ షెడ్యూల్ పూర్తైతే మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది. జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Similar News
News February 11, 2025
PM ఫ్రాన్స్ పర్యటనలో చేసుకునే రక్షణ ఒప్పందాలివే

ఫ్రాన్స్‌నుంచి 26 రఫేల్-ఎం యుద్ధవిమానాలు, 3 స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్లను నేవీ కోసం కొనుగోలు చేయాలని భారత్ సూచనప్రాయంగా నిర్ణయించింది. ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో ఈ ఒప్పందం పూర్తికానుంది. ఫైటర్ జెట్స్ ఒప్పందం విలువ రూ.63వేల కోట్లుగా ఉండొచ్చని అంచనా. INS విక్రాంత్, INS విక్రమాదిత్య నౌకలపై వీటిని మోహరించనున్నారు. ఇక 3 సబ్‌మెరైన్ల కొనుగోలు విలువ రూ.33,500 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.
News February 11, 2025
ప్రభాస్ ముగ్గురు చెల్లెళ్లను చూశారా?

దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, ముగ్గురు కూతుళ్లు(ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి) బంధువుల పెళ్లిలో దిగిన ఫొటో వైరలవుతోంది. సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ వేడుకకు హాజరుకాలేదు. ఈ క్రమంలో చెల్లెళ్లంతా కలిసి డార్లింగ్‌కు త్వరగా వివాహం జరిపించాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కొడుకే ప్రభాస్. ఇతనికి అన్న ప్రబోధ్(నిర్మాత), సోదరి ప్రగతి ఉన్నారు.
News February 11, 2025
రామ్మోహన్ నాయుడుకు ‘యువ వక్త’ పురస్కారం

AP: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అరుదైన గుర్తింపు లభించింది. పుణేలోని ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్శిటీ ఆయనకు ‘ఉత్తమ యువ వక్త ఆఫ్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్’ అవార్డును ప్రదానం చేసింది. అతి పిన్న వయస్సులో ఎంపీగా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రామ్మోహన్ తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారని నిర్వాహకులు కొనియాడారు. కాగా ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన తెలిపారు.