News June 10, 2024
రాష్ట్రంలో తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం

APలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ హిందూపురంలో ప్రారంభమైంది. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా రూ.5కే ఆహారం అందించే ఈ క్యాంటీన్‌ను స్థానిక MLA నందమూరి బాలకృష్ణ పున:ప్రారంభించారు. NBK స్వయంగా వడ్డించి వృద్ధులకు ఆహారం తినిపించారు. తాము అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని ఎన్నికల్లో టీడీపీ ప్రకటించింది. ఆ దిశగా ఇవాళ తొలి అడుగు పడటంతో మిగతా చోట్ల కూడా త్వరలోనే ప్రారంభమయ్యే ఛాన్సుంది.
Similar News
News March 22, 2025
భార్య నుంచి ఆ కాల్ వస్తే చాలా టెన్షన్: అభిషేక్ బచ్చన్

‘ఐ వాంట్ టు టాక్’ అనే సినిమాకు ‘ఉత్తమ నటుడు’ పురస్కారం అందుకున్న సందర్భంగా నటుడు అభిషేక్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఐ వాంట్ టు టాక్’ అని ఎవరి కాల్ వస్తే మీరు టెన్షన్ పడతారంటూ హోస్ట్ అర్జున్ కపూర్ ప్రశ్నించగా.. తన భార్య నుంచి ఆ కాల్ వస్తే సమస్యలో పడ్డట్లేనని అభిషేక్ జవాబిచ్చారు. ఐష్, అభిషేక్ విడిపోనున్నారని గత కొంతకాలంగా వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
News March 22, 2025
IPL-2025: డూడుల్ మార్చిన గూగుల్

అతిపెద్ద ఫ్రాంచైజ్ క్రికెట్ పండుగ IPL ఈ రోజు ప్రారంభం కానుండటంతో ‘గూగుల్’ ప్రత్యేక డూడుల్‌ని ఆవిష్కరించింది. డూడుల్‌ను క్రికెట్ పిచ్‌గా మార్చేసి, రెండు డక్స్ ఆడుతున్నట్లు చూపించింది. కాగా, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈరోజు KKR, RCB మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ జట్ల మధ్య ఇప్పటివరకు 34 మ్యాచులు జరగ్గా KKR 20, RCB 14 మ్యాచ్‌లు గెలిచాయి. నేటి మ్యాచ్‌లో గెలుపెవరిది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News March 22, 2025
ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

డీలిమిటేషన్‌పై చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేరళ సీఎం విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పంజాబ్ సీఎం మాన్ తదితరులు హాజరయ్యారు. వారిని స్టాలిన్ సత్కరించారు. సమావేశానికి బెంగాల్ సీఎం మమత గైర్హాజరయ్యారు.