News December 6, 2024
టెస్టు క్రికెట్‌లో ‘తొలి సిక్సర్’ విశేషమిదే

క్రికెట్ అంటే సిక్సులు, ఫోర్లు అనే స్థాయికి ఆట రూపాంతరం చెందింది. కానీ క్రికెట్ మొదలైన తొలి నాళ్లలో పరిస్థితి వేరుగా ఉండేది. 1877లో ENG-AUS మధ్య తొలి అధికారిక టెస్ట్ జరిగింది. 21 ఏళ్ల తర్వాత 1898లో ఆసీస్ బ్యాటర్ జో డార్లింగ్ టెస్టు క్రికెట్‌లోనే తొలి సిక్సర్ బాదారు. ఆ రోజుల్లో గ్రౌండ్ బయట బంతి పడితేనే సిక్సర్‌గా పరిగణించేవారు. బౌండరీకి 5 రన్స్ ఇచ్చేవారు. కాలక్రమంలో బౌండరీ లైన్ రూల్ మారింది.
Similar News
News March 5, 2026
10 సార్లు సీఎం.. ఇక శకం ముగిసినట్లే!

బిహార్‌లో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రికార్డు నితీశ్ పేరిట ఉంది. ఏకంగా 10 సార్లు ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి 2000 సం.లో కేవలం 7 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2005, 10, 15 (2 సార్లు), 17, 20, 22, 24, 25లో CM కుర్చీ ఎక్కారు. OBCలు, మహిళల మద్దతుతో పాటు వివిధ పార్టీలతో పొత్తుల ద్వారా ఎక్కువ కాలం సీఎంగా కొనసాగారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్‌లో ఆయన శకం ముగిసినట్లే భావించాలి.
News March 5, 2026
ప్రపంచంలో రద్దీగా ఉండే జలసంధులు ఇవే..

వివిధ ఖండాల మధ్య ఉన్న జలసంధుల ద్వారా చమురు రవాణా సాగుతుంటుంది. ఇందులో మలక్కా జలసంధి అతి ముఖ్యమైనది. ఇండోనేషియా దీవుల్లో ఉండే ఈ సంధి ద్వారా రోజుకు 23.2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ సరఫరా అవుతుంది. ఆ తర్వాత ఇరాన్ దగ్గరలోని హార్ముజ్ (20.9 M), సౌతాఫ్రికా కింద ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ (9.1 M), ఈజిప్ట్ సూయిజ్ కెనాల్ (4.9 M), డానిష్ సంధి (4.9 M) ఉన్నాయి. తాజా యుద్ధంతో హార్ముజ్‌ను మూసివేశారు.
News March 5, 2026
హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

HYDలోని<


