News May 12, 2024
మొదటి ఓటు పార్లమెంట్ అభ్యర్థికి, రెండోది అసెంబ్లీ అభ్యర్థికి

AP ఎన్నికల్లో ఓటర్లు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి అసెంబ్లీకి అయితే, మరొకటి పార్లమెంట్కి. ముందుగా పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేయాలి. ఆ తర్వాతే అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థికి ఓటు వేయాలి. ఈ రెండు బ్యాలట్ యూనిట్లు వేర్వేరుగా ఉంటాయి. అటూ ఇటూ కాకుండా.. పోటీ చేసే అభ్యర్థి పేరు, ఫొటో, గుర్తు చూసి EVMలపై బటన్లు నొక్కండి.
☞ మీ భవిష్యత్తును మార్చే అభ్యర్థిని ఎన్నుకోండి.
Similar News
News November 20, 2025
ANU: రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత ఏప్రిల్, ఫిబ్రవరిలో విడుదల చేసిన LLB 5 సంవత్సరాల రీవాల్యుయేషన్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. LLB 5 సంవత్సరాల ఫస్ట్ సెమిస్టర్, 3వ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.


