News August 15, 2024
ఆ ప్రాంతంలో నిన్న రాత్రే జెండా ఎగురవేశారు!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నేడు ఉదయం మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. కానీ బిహార్‌లోని పూర్నియాలో మాత్రం నిన్న రాత్రే ఈ కార్యక్రమం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిందని తెలియగానే 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి సమయంలో పూర్నియాలో రామేశ్వరప్రసాద్ సింగ్ అనే వ్యక్తి అక్కడి జెండా చౌక్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అప్పటి నుంచీ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు.
Similar News
News September 15, 2024
రిటైర్మెంట్‌పై స్టార్ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు
తన ఆటను మెరుగుపరుచుకోలేదని భావించినప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. ఆటకు వీడ్కోలు పలకడం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోలేదని, దీంతో ఆటపై ప్రేమను కోల్పోదలుచుకోలేదన్నారు.
News September 15, 2024
స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు కొరత రాకుండా చూస్తాం: శ్రీనివాస వర్మ
AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిన విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు ఇలాంటి సమస్య కొత్తగా వచ్చినది కాదని వ్యాఖ్యానించారు. బొగ్గు కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వరదలతో నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు.
News September 15, 2024
ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. టాటానగర్-పట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోగఢ్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మార్గాల్లో ప్రయాణించే రైళ్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. వాస్తవానికి ఝార్ఖండ్‌లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.