News March 30, 2025
శ్రీరామనవమి ఉత్సవాలకు ఇవాళ అంకురార్పణ

TG: భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు అర్చకులు ఇవాళ అంకురార్పణ చేయనున్నారు. ఏటా ఉగాది నాడు ఈ వేడుకలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడంతోపాటు ఆస్థాన పురోహితులతో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. సీతారాములవారి రాశి ఫలాలను వివరిస్తారు. ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్ 12 వరకు నిత్య కళ్యాణాలను నిలిపివేసినట్లు అర్చకులు తెలిపారు.
Similar News
News April 22, 2025
నేడు సౌదీ పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఇవాళ సౌదీ అరేబియాకు బయలుదేరనున్నారు. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు జెడ్డాలో ఆయన రెండు రోజులు పర్యటించనున్నారు. మోదీ, సల్మాన్ భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ పర్యటనలో భారీ సంఖ్యలో ఒప్పందాలపై సంతకాలతో పాటు ఆర్థిక, మిలిటరీ భాగస్వామ్యం, రాజకీయ సంబంధాలపై చర్చ జరగనుందని సౌదీలోని భారత అంబాసిడర్ అజాజ్ ఖాన్ వెల్లడించారు.
News April 22, 2025
IPL: ‘టాప్’ లేపుతున్న గుజరాత్

ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొడుతోంది. కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టేబుల్ టాపర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు సైతం ఆ జట్టు వద్దే ఉన్నాయి. ఓపెనర్ సాయి సుదర్శన్ 417 రన్స్, బౌలర్ ప్రసిద్ధ్ 16 వికెట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. సాయి సుదర్శన్, గిల్, బట్లర్‌తో GT టాప్ ఆర్డర్ దుర్భేద్యంగా ఉంది.
News April 22, 2025
866 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు

AP: ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీపై ఏపీపీఎస్సీ ఫోకస్ చేసింది. వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. నెల రోజుల్లో రోస్టర్ పాయింట్ల ఖరారు తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు అగ్రికల్చర్, రవాణా, మున్సిపల్, జైళ్లు తదితర శాఖల్లో ఖాళీలున్నాయి.