News June 4, 2024

ప్రశ్నార్థకంగా బీఆర్ఎస్ భవిష్యత్!

image

TG: తెలంగాణలో BRS బోణీ కొట్టకపోవడంతో ఆపార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రంలో చక్రం తిప్పుతామనే గులాబీ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోగా.. ఇప్పుడు ఎంపీ సీట్లు అయినా గెలిచి పార్టీలో నూతన ఉత్తేజం తీసుకొద్దామనుకున్నా మొండిచేయి ఎదురైంది. మరి పార్టీ పునరుత్తేజం కోసం కేసీఆర్ ఎలాంటి అడుగులు వేస్తారో వేచి చూడాలి.

Similar News

News November 13, 2024

కులగణన గేమ్ చేంజర్ కాబోతోంది: CM రేవంత్

image

TG: రాష్ట్రంలో చేపట్టిన కులగణన గేమ్ చేంజర్ కాబోతోందని CM రేవంత్ అన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలకు చేరాలంటే ప్రభుత్వం వద్ద సరైన గణాంకాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అసలు గణాంకాలు లేకుంటే అసలైన అర్హులకు న్యాయం చేయలేమని అన్నారు. అందుకే కులగణన చేపట్టామని, ఇదొక మైలురాయిగా మిగులుతుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఇంటర్వ్యూలో ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

News November 13, 2024

నవంబర్ 13: చరిత్రలో ఈ రోజు

image

* 1780: భారత దేశంలో సిక్కు సామ్రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్ జననం.
* 1935: సినిమా నేపథ్య గాయని పి.సుశీల జననం.
* 1973: భారత స్వాతంత్ర్య సమరయోధురాలు బారు అలివేలమ్మ మరణం.
* 1990: మొట్టమొదటి వెబ్ పేజీ తయారీ.
* 2002: ప్రజా కవి, పద్మవిభూషణ గ్రహీత కాళోజీ నారాయణరావు మరణం.(ఫొటోలో)

News November 13, 2024

నేడు శ్రీలంకvsన్యూజిలాండ్ తొలి వన్డే

image

శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఈరోజు జరగనుంది. డంబుల్లా వేదికగా మధ్యాహ్నం 2.30గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమమైంది. కాగా స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌నైనా గెలవాలని శ్రీలంక భావిస్తోంది. అటు లంకేయుల చేతిలో ఇటీవల టెస్టుల్లో ఎదురైన పరాభవానికి బదులుగా ఈ సిరీస్ గెలవాలని కివీస్ భావిస్తోంది.