News December 29, 2024

పాక్ చేతిలో భారత టెస్టు ఛాంపియన్‌షిప్ భవిష్యత్తు

image

భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ అర్హత ఇప్పుడు పాక్ చేతిలో ఉంది. PAKvsSA మ్యాచ్‌లో ఆఖరి ఇన్నింగ్స్‌లో 148 పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది. మూడోరోజు స్టంప్స్ సమయానికి ఆ జట్టు స్కోరు 27/3గా ఉంది. మిగిలిన 121 రన్స్ చేస్తే టెస్టు ఛాంపియన్ షిప్‌కి సౌతాఫ్రికా అర్హత సాధిస్తుంది. ఆస్ట్రేలియాకు ఇంకా 2 టెస్టులు శ్రీలంకతో ఉన్న నేపథ్యంలో సౌతాఫ్రికా ఓడితేనే భారత్‌కు ఫైనల్‌కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

Similar News

News December 29, 2024

నేను జనసేనలో చేరడం లేదు: తమ్మినేని సీతారాం

image

AP: తనకు జనసేనలో చేరాల్సిన అవసరం లేదని YCP నేత తమ్మినేని సీతారాం అన్నారు. ‘నేను పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవం. నా కుమారుడు ఆస్పత్రిలో ఉండటంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఆపండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తమ్మినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలసకు కొత్త ఇన్‌ఛార్జిని పెట్టడంతో పార్టీపై ఆయన గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

News December 29, 2024

కాంగ్రెస్‌వి చీప్ పాలిటిక్స్‌: బీజేపీ

image

మ‌న్మోహ‌న్ స్మార‌కార్థం స్థ‌లాన్ని కేటాయించ‌కుండా ఆయ‌న్ను అవ‌మానించారంటూ కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటని BJP మండిపడింది. అంత్య‌క్రియ‌ల్లో మోదీ, అమిత్ షా కేంద్రంగా మీడియా కవరేజ్ చేశార‌నేది అవాస్త‌వ‌మ‌ని, భ‌ద్ర‌తా సంస్థ‌లు క‌వ‌రేజీపై ఆంక్ష‌లు విధించాయని పేర్కొంది. సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలను ఖండించింది. ప్రొటోకాల్ ప్రకారం ఫస్ట్ రోలో Ex PM కుటుంబ సభ్యులకు 5 కుర్చీలు కేటాయించారంది.

News December 29, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ వార్నింగ్

image

TG: సంక్రాంతిలోపు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పండగ తర్వాత ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.