News September 30, 2024
నాలుగో రోజు ముగిసిన ఆట

భారత్-బంగ్లా రెండో టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 26 రన్స్ చేసింది. అశ్విన్‌కే 2 వికెట్లు పడ్డాయి. బంగ్లా మరో 26 రన్స్ వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285/9 వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లా 233 రన్స్‌కు ఆలౌటైంది.
Similar News
News October 27, 2025
BWF-2025 తదుపరి టోర్నీలకు పీవీ సింధు దూరం

ఒలింపిక్ బ్యాడ్మింటన్ పతక విజేత PV సింధు ‘BWF TOUR-2025’ తదుపరి ఈవెంట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. యూరోపియన్ లీగ్‌కు ముందు పాదానికి తగిలిన గాయం పూర్తిగా మానకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గాయం కొంత తగ్గినప్పటికీ దీర్ఘకాలిక ఫిట్నెస్, ఆట మెరుగుపడటానికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారన్నారు. 2026 JANలో బ్యాడ్మింటన్ కోర్టులో దిగేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
News October 27, 2025
తుఫాను.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3వేలు

AP: తుఫానుపై కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, 25 కేజీల బియ్యం సహా నిత్యావసరాల పంపిణీ చేయాలని ఆదేశించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా చెరువులు, కాలువ గట్లు తెగిపోకుండా చూడాలని, ప్రజలెవరూ బయటకు రాకుండా చూసుకోవాలని తెలిపారు.
News October 27, 2025
ఇంటి చిట్కాలు

* గాజు సామగ్రిపై ఉప్పు చల్లి, తర్వాత శుభ్రపరిస్తే అవి తళతళా మెరుస్తాయి.
* వెండి సామగ్రి భద్రపరిచేటపుడు వాటితో సుద్దముక్కని కూడా పెట్టాలి. ఇవి తేమను పీల్చుకుని వెండి నల్లబడకుండా చేస్తాయి.
* సన్నని మూతి ఉన్న ఫ్లవర్ వాజు క్లీన్ చేయాలంటే బియ్యం, గోరువెచ్చని నీళ్ళు వేసి బాగా గిలకొట్టి శుభ్రం చేయాలి.
* బల్లుల బెడద ఎక్కువగా ఉంటే, నెమలీకలు గోడలకి తగిలిస్తే సమస్య తగ్గుతుంది.


