News August 4, 2024

రేపు తెరుచుకోనున్న ‘సాగర్’ గేట్లు

image

శ్రీశైలం నుంచి భారీ వరద కొనసాగుతుండటంతో రేపు నాగార్జునసాగర్ జలాశయం గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 3.21 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 575 అడుగులుగా ఉంది. జలాశయం ఫుల్ కెపాసిటీ 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 269 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాలువల ద్వారా 38వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

Similar News

News September 11, 2024

సీఎం రేవంత్ సొంత గ్రామంలో సౌర విద్యుత్ పైలట్ ప్రాజెక్టు

image

TG: సీఎం రేవంత్ సొంత గ్రామం నాగర్ కర్నూల్(D) కొండారెడ్డిపల్లితో పాటు ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా సౌరవిద్యుత్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని TGSPDCL CMD వెల్లడించారు. కొండారెడ్డిపల్లిలో సర్వే చేశామని, త్వరలో గృహ, వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు ఉచిత సౌర విద్యుత్ పంపుసెట్లు పంపిణీ చేస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే ప్రతి పల్లెలో దీనిని అమలు చేయనున్నట్లు తెలిపారు.

News September 11, 2024

ఆన్‌లైన్‌లో ఫ్రీగా సినిమాలు చూస్తున్నారా?

image

డబ్బులు చెల్లించి OTTలో కాకుండా వివిధ అక్రమ వెబ్‌సైట్ల నుంచి సినిమాలు, వెబ్‌సిరీస్‌లను డౌన్‌లోడ్ చేసుకుని చూడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇటు ప్రేక్షకులు, అటు పైరసీ చేసేవారు పన్ను ఎగవేస్తుండటంతో భారత్ భారీగా ఆదాయం కోల్పోతోంది. అంతేకాదు యూజర్ల వ్యక్తిగత డేటాను డార్క్ వెబ్‌కు అమ్మేస్తున్నట్లు తేలింది. ఆ ఆదాయాన్ని మానవ, ఆయుధాల అక్రమ రవాణా, డ్రగ్స్ కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

News September 11, 2024

‘దేవర’ నుంచి మరో ట్రైలర్?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ నుంచి మరో ట్రైలర్ రానున్నట్లు తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ రావడంతో మరో ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ నెల 27న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.