News November 26, 2024

రాజ్యాంగం లక్ష్యం అదే: సీఎం చంద్రబాబు

image

AP: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదని సీఎం చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ వజ్రోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేదే రాజ్యాంగం లక్ష్యం. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి దీనిని రచించారు. రాజ్యాంగ పరిషత్‌లో తెలుగు వాళ్లు కీలక పాత్ర పోషించారు. రాజ్యాంగాన్ని కొందరు తమ చేతుల్లోకి తీసుకుని ప్రాథమిక హక్కుల్ని కాలరాశారు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News December 9, 2024

మేం ఏమన్నా లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా?: మ‌మ‌త

image

భారత్‌లోని పలు రాష్ట్రాలను ఆక్ర‌మించుకుంటామ‌ని కొంద‌రు బంగ్లా రాజ‌కీయ నేతలు, మాజీ సైనికోద్యోగులు చేసిన వ్యాఖ్య‌ల‌కు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కౌంట‌ర్ ఇచ్చారు. ‘మీరు బెంగాల్‌, ఒడిశా, బిహార్‌ల‌ను ఆక్ర‌మించుకుంటుంటే మేము మాత్రం లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా?’ అంటూ కౌంట‌ర్ అటాక్ చేశారు. బంగ్లాలో హిందువులు హింస‌కు గుర‌వుతుండ‌డంపై బెంగాల్ హిందూ, ముస్లింలు ఆందోళ‌న‌గా ఉన్నార‌ని ఆమె పేర్కొన్నారు.

News December 9, 2024

ధ‌న్‌ఖఢ్‌పై విప‌క్షాల అవిశ్వాస తీర్మానం!

image

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ జగదీప్ ధ‌న్‌ఖఢ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని విప‌క్ష ఇండియా కూట‌మి పార్టీలు నిర్ణ‌యించాయి. గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న స‌భ‌ను న‌డుపుతున్న తీరుపై విప‌క్షాలు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నాయి. ప్రతి అంశంలోనూ ఛైర్మన్ తమతో వాగ్వాదానికి దిగుతున్నారని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన తీర్మానంపై TMC, AAP, SP సంత‌కాలు చేశాయి. త్వరలో సభలో ప్రవేశపెట్టనున్నాయి.

News December 9, 2024

తల్లి మందలించిందని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

TG: రైలు కిందపడి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. స్థానిక ఓ పాఠశాలలో టెన్త్ చదువుతున్న లక్ష్మీనక్షత్ర(13)ను ఆమె తల్లి ఏదో విషయంలో మందలించింది. దీంతో క్షణికావేశానికి లోనైన ఆమె రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది. రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మీనక్షత్ర మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.