News June 14, 2024

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి వచ్చిన 82.82 లక్షల దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది. ఏడాదికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Similar News

News September 19, 2024

పెన్షన్లపై ప్రభుత్వం శుభవార్త

image

AP: అర్హులకు పెన్షన్లు అందేలా చూసేందుకు త్వరలోనే సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సెర్ప్‌పై CM చంద్రబాబుతో సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడారు. ‘పెన్షన్లు అందని వారికి పెన్షన్లు ఇస్తాం. 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేసే అంశంపై చర్చించాం. 50-60 ఏళ్ల మధ్య ఉన్న వారు 15 లక్షల మంది ఉన్నారు. త్వరలోనే వారికి పెన్షన్లు ఇవ్వడంపై మార్గదర్శకాలు రూపొందిస్తాం’ అని మంత్రి చెప్పారు.

News September 19, 2024

ఒక్క టెస్టూ ఆడకుండా 100 వన్డేలు ఆడేశాడు

image

ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒక్క టెస్టు కూడా ఆడకుండానే 100 వన్డేలు ఆడిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించారు. ఈ ఫీట్ సాధించిన తొలి ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా రికార్డులకెక్కారు. కాగా జంపా ఇప్పటివరకు 100 వన్డేల్లో 170 వికెట్లు, 92 టీ20ల్లో 111 వికెట్లు తీశారు. త్వరలో ఇంగ్లండ్‌తో జరగబోయే యాషెస్ సిరీస్‌కు ఆయన ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

News September 19, 2024

కొత్త బుల్లెట్ వేరియెంట్ తీసుకొచ్చిన ఎన్‌ఫీల్డ్

image

బెటాలియన్ బ్లాక్ పేరిట రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌లో కొత్త వేరియెంట్‌ను తీసుకొచ్చింది. గోల్డ్ పిన్ స్ట్రైపింగ్, బెంచ్ సీట్, పెద్ద సైజు నేమ్ బ్యాడ్జిలతో వింటేజ్ బుల్లెట్‌ను గుర్తుచేసేలా దీన్ని డిజైన్ చేసింది. 349సీసీ సింగిల్ సిలిండర్, 5 స్పీడ్ గేర్ బాక్స్, ముందు 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుక వైపు 153 ఎంఎం డ్రమ్ బ్రేక్, సింగిల్ ఛానల్ ఏబీఎస్ అందిస్తోంది. ధర రూ.1.75 లక్షలు(ఢిల్లీ ఎక్స్ షోరూమ్‌).