News October 28, 2024

రుడా ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు

image

TG:రామగుండం కార్పొరేషన్ కేంద్రంగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. పెద్దపల్లి జిల్లా మొత్తాన్ని రుడా పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. రామగుండం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలతో పాటు 191 గ్రామాలను దీని పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో చేరడంపై గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక ప్రభుత్వం GO జారీ చేసే ఛాన్సుంది.

Similar News

News November 24, 2025

పిల్లల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా?

image

ఇదివరకు పిల్లల ఫొటోలు, వీడియోలు కుటుంబం వరకే పరిమితమయ్యేవి. కానీ సోషల్మీడియా వచ్చిన తర్వాత పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ పేరెంట్స్ ప్రపంచంతో షేర్‌ చేసుకుంటున్నారు. అయితే ఇది సరికాదంటున్నారు నిపుణులు. పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల ఫొటోలు, వివరాలు షేర్ చేయడం వల్ల మార్ఫింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.

News November 24, 2025

అమెరికా వీసా రాలేదని..

image

ట్రంప్ కఠిన వీసా నిబంధనలు తెలుగు డాక్టర్ మరణానికి కారణమయ్యాయి. US వీసా రాలేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి HYDలో ఆత్మహత్య చేసుకున్నారు. MBBS చేసిన ఆమె USలో PG చేసేందుకు J1 వీసాకు దరఖాస్తు చేశారు. HYDలోని US కాన్సులేట్‌లో జరిగిన చివరి రౌండ్ ఇంటర్వ్యూలో ‘శాశ్వతంగా USలోనే ఉండిపోవాలనే ఉద్దేశం’ అని కారణాన్ని చూపుతూ రిజెక్ట్ చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన రోహిణి సూసైడ్ చేసుకున్నారు.

News November 24, 2025

DEC తొలి వారంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు!

image

AP: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి DEC తొలి వారంలో నియామక పత్రాలు అందజేసి, శిక్షణకు పంపిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చినట్లు MLC వేపాడ చిరంజీవి తెలిపారు. ఇదే విషయమై ఆమెకు లేఖ రాయగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు ఈ ఏడాది జూన్‌లో మెయిన్స్ నిర్వహించి AUGలో ఫలితాలు ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపిక చేసినా ట్రైనింగ్ ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు నిరాశతో ఉన్నారు.