News August 23, 2024

ఖాళీ అపార్ట్‌మెంట్లు, స్థలాల వేలానికి ప్రభుత్వం కసరత్తు!

image

TG: ఖాళీగా ఉన్న రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్లు, స్థలాలను వేలం వేస్తే ₹1,900కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాల ద్వారా మరో ₹1,500కోట్లు వస్తాయని, వీటిని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వినియోగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 9 జిల్లాల్లోని 1,342 ప్లాట్లు, పోచారం, గాజులరామారం, జవహర్‌నగర్, ఖమ్మంలో టవర్లు, బండ్లగూడ, పోచారంలో ఫ్లాట్ల వేలానికి కసరత్తు చేస్తోంది.

Similar News

News September 17, 2024

చైనాకు మద్దతు తెలిపిన పాక్ ఆటగాళ్లు

image

ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో చైనాకు పాక్ ఆటగాళ్లు మ‌ద్ద‌తు తెలిపారు. పాక్‌ ఎవ‌రి చేతిలో సెమీస్‌లో ఓట‌మిపాలైందో వారికే సపోర్ట్ చేయడం గ‌మ‌నార్హం. మ్యాచ్ సంద‌ర్భంగా పాక్ ఆట‌గాళ్లు చైనా జెండాల‌ను చేత‌బ‌ట్టుకొని క‌నిపించారు. ఈ మ్యాచ్‌లో పాక్ ఎవరికి మద్దతు ఇస్తున్నది స్ప‌ష్ట‌ం అవుతోందంటూ కామెంటేట‌ర్ వ్యాఖ్యానించారు. ఆ దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి.

News September 17, 2024

వినాయక నిమజ్జనంలో ప్రమాదం

image

మహారాష్ట్రలో వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపు ప్రారంభానికి ముందు ట్రాక్టర్ డ్రైవర్ ఎక్కడికో వెళ్లగా.. మరో వ్యక్తి స్టార్ట్ చేశాడు. అది రివర్స్ వెళ్లి ప్రజలపైకి దూసుకెళ్లడంతో 13, 6, 3 ఏళ్ల పిల్లలు దుర్మరణం పాలయ్యారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వ్యక్తి, అసలైన డ్రైవర్ పారిపోగా, పోలీసులు వెతికి పట్టుకున్నారు. ధూలే జిల్లాలోని చిత్తోడ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.

News September 17, 2024

మీ ఫోన్ చోరీకి గురికాకుండా ఇలా చేయండి

image

మీ ఫోన్ చోరీకి గురైనా కూడా దాని లైవ్ లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు. Track it EVEN if it is off అనే యాప్‌ను నచ్చిన ప్లాన్‌తో స‌బ్‌స్క్రైబ్‌ చేసుకొని అందులో ‘యాంటీ థెఫ్ట్’ సెల‌క్ట్ చేసుకొని ఫేక్ ష‌ట్‌డౌన్ ఆన్ చేసుకోవాలి. ఫోన్ చోరీకి గురైన‌ప్పుడు ఆగంతకులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాక డివైస్ ఆఫ్ అయినట్టు కనిపిస్తుంది. కానీ, ఫోన్ ఆన్‌లోనే ఉంటుంది. యాప్ వెబ్‌సైట్ ద్వారా ఫోన్‌ లోకేష‌న్‌ను ఈజీగా ట్రాక్‌ చేయ‌వ‌చ్చు.