News February 12, 2025
ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.35వేలు ఇవ్వాలి: కవిత

TG: ప్రతి మహిళకు నెలకు ₹2,500 చొప్పున ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని MLC కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిందని, ఒక్కో మహిళకు సర్కార్ ₹35వేలు జమ చేయాలని అన్నారు. మహిళా దినోత్సవంలోపు ఈ హామీని నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో పోరాడతామని హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
Similar News
News January 10, 2026
విశాఖ రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన డీఆర్ఎం

విశాఖ రైల్వే స్టేషన్లో వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోహ్ర శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులు సౌలభ్యం కోసం అదనపు టికెట్ కౌంటర్లు, టికెట్ వెండింగ్ మిషన్లు, తాగునీరును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు డోర్ వద్ద నిలుచుని ప్రయాణం చేయకూడదని సూచించారు. ప్లాట్ ఫారం అవతల నుంచి రైలు ఎక్కడం వంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని ఆర్పీఎఫ్ పోలీసులను ఆదేశించారు.
News January 10, 2026
‘నాకు సంబంధం లేదు’.. మరి ఎవరది?

తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపు చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు <<18810168>>అభ్యంతరం<<>>, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు <<18818989>>సంబంధం<<>> లేదని చెబుతున్నా అనుమతులు వస్తున్నాయి. మొన్న అర్ధరాత్రి ‘రాజాసాబ్’, తాజాగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ టికెట్ ధరల పెంపునకు అనుమతి వచ్చింది. హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనుమతిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో ఉండగా రేట్ల పెంపు ఎవరు వెనక ఉండి నడిపిస్తున్నారనే చర్చ మొదలైంది.
News January 10, 2026
అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

ప్రపంచంలో ఎక్కువగా <<18798755>>చమురు<<>> ఉత్పత్తి చేసేది అమెరికానే. 2025లో రోజూ 1.34 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అమ్మింది. అయినా ఇతర దేశాల నుంచి ఆయిల్ ఎందుకు కొంటోంది? తమ దగ్గర ఉత్పత్తి అయ్యే లైట్ క్రూడ్ విలువ ఎక్కువ కావడమే కారణం. తేలికపాటి ముడి చమురును అధిక ధరకు అమ్మి, హెవీ క్రూడ్ను తక్కువకే కొంటోంది. హెవీ క్రూడ్ను శుద్ధి చేసే రిఫైనరీలు USలో ఉండటం మరో కారణం. 2025లో 20L బ్యారెళ్లను కొనుగోలు చేసింది.


