News January 6, 2025

GOOD NEWS చెప్పిన ప్రభుత్వం

image

TG: ఈ నెల 26 నుంచి ప్రభుత్వం రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఇందుకోసం రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సాగుకు యోగ్యం కాని భూములపై సర్వే చేసి 10 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దీని ప్రకారం వ్యవసాయం చేసే భూములకే డబ్బులు అందనున్నాయి. ఈ స్కీం కింద ఏడాదికి ఎకరానికి రూ.12వేలు అందుతాయి.

Similar News

News January 7, 2025

మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా: KTR

image

TG: లాయర్ల సమక్షంలోనే తన విచారణ జరగాలని హైకోర్టును ఆశ్రయించనున్నట్లు KTR వెల్లడించారు. తనకు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరుతానన్నారు. విచారణకు లాయర్లతో రావొద్దని చెబుతున్నారని, ఇలానే వెళ్లిన తమ పార్టీ నేత పట్నం నరేందర్‌రెడ్డి ఇవ్వని స్టేట్‌మెంట్లు ఇచ్చినట్లు బుకాయించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై అక్రమ కేసులు పెట్టారని, సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.

News January 7, 2025

తొలి హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు

image

TG: చెరువుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా తొలి పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. బుద్ధ భవన్‌లోని బి-బ్లాక్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా కార్యకలాపాలన్నీ ఈ స్టేషన్ ద్వారా నిర్వహిస్తారు. ఏసీపీ స్థాయి అధికారి నిర్వహణను చూస్తారు. దీనికి తగిన సిబ్బందిని కేటాయించాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, నాలాల ఆక్రమణలపై ప్రజలకున్న ఫిర్యాదుల్ని ఈ స్టేషన్లో స్వీకరిస్తారు.

News January 7, 2025

నాకేమైనా ఉరిశిక్ష పడిందా?: KTR

image

TG: చట్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతోనే నిన్న తాను ACB విచారణకు హాజరయ్యానని KTR తెలిపారు. కక్ష సాధింపు కేసు అని తెలిసి కూడా వెళ్లానన్నారు. తన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఏదో ఉరిశిక్ష పడినట్లు కాంగ్రెస్ నేతలు ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. కొందరు మంత్రులైతే న్యాయమూర్తుల్లా ఫీలవుతున్నారని సెటైర్లు వేశారు. న్యాయపరంగా ఈ అంశంపై పోరాటం చేస్తానని, లాయర్లతో విచారణకు వెళ్తానని KTR స్పష్టం చేశారు.