News January 18, 2025

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

TG: రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందొద్దని, గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కులగణన ఆధారంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కార్డు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక పాత రేషన్ కార్డులు తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపైనా ఉత్తమ్ స్పందించారు. అలాంటిదేమీ ఉండదని, పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేరుస్తామని చెప్పారు.

Similar News

News February 11, 2026

శివుడు లేని చోటు గలదా?

image

ఓ సముద్రంలో పుట్టిన అల, తను సముద్రం కంటే వేరు అనుకుంటుంది. అందుకే ప్రతిసారి ఉవ్వెత్తున ఎగసి ఒడ్డుకు వస్తుంది. కానీ అలకు మూలం, ఆధారం, అంతం ఆ సముద్రమే! అలాగే ఈ జగత్తులో మనం చూసే ప్రతి రూపం ఆ మహాశివుడనే సముద్రంలో పుట్టిన చిన్న అల మాత్రమే. రూపం చూస్తే అది మనిషిలాగో లేదా రాయిలాగో కనిపిస్తుంది. కానీ దాని సారాన్ని చూస్తేనే అది శివతత్వం అని అర్థమవుతుంది. సర్వం శివమే అని నమ్మితే ఆయన అనుగ్రహం కలుగుతుంది.

News February 11, 2026

న్యూజిలాండ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం

image

T20 WCలో వరుస విజయాలతో జోరు మీదున్న న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు. ఆదివారం వార్మప్ సమయంలో అతను గాయపడినట్లు న్యూజిలాండ్ క్రికెట్(NZC) తెలిపింది. బ్రేస్‌వెల్ స్థానంలో కోల్ మెక్‌కాంచీ రిజర్వ్ బౌలర్ బెన్ సియర్స్‌తో కలిసి జట్టులో చేరనున్నట్లు పేర్కొంది. న్యూజిలాండ్ తన మూడో మ్యాచ్ ఈ నెల 14న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.

News February 11, 2026

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారా?

image

TG: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మార్చి 1 నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు HYD పోలీసులు తెలిపారు. DL లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తించదని పేర్కొన్నారు. లైసెన్స్ లేనివారు RTA కార్యాలయం నుంచి తీసుకోవాలని సూచించారు.
* మైనర్లకు వాహనం ఇవ్వకపోవడం ఉత్తమం.