News December 19, 2024

ధరణితో పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు: పాయల్ శంకర్

image

TG: ధరణిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేశారు. ‘మాయలపకీరు చేతిలో చిలకలా ధరణి ఉండేది. మాయల పకీరు చెప్పనిదే సొంత భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి. ధరణితో పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ప్రభుత్వం భూభారతి పేరుతో చాలా మార్పులు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఇంకా మార్పులు చేయాల్సి ఉంది. VRA వ్యవస్థను తిరిగి తీసుకురావాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News January 14, 2025

ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, కేసీఆర్, బాలయ్య

image

సంక్రాంతి వేళ ఏపీ సీఎం చంద్రబాబు, BRS అధినేత కేసీఆర్, బాలకృష్ణలతో కూడిన ఫ్లెక్సీ వైరల్ అవుతోంది. చంద్రబాబు కింద బాస్ ఈజ్ బ్యాక్, బాలయ్య కింద డాకు మహారాజ్, కేసీఆర్ కింద బాస్ ఈజ్ కమింగ్ సూన్ అని రాశారు. ఆ ఫ్లెక్సీలో లోకేశ్, కేటీఆర్, జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లాలోని ముగ్గు వెంకటాపురంలో ఈ బ్యానర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎవరు దీన్ని పెట్టారో క్లారిటీ రావాల్సి ఉంది.

News January 14, 2025

ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి కొత్త పోస్టర్

image

సంక్రాంతి కానుకగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజా పోస్టర్‌లో మూవీ టీమ్ రిలీజ్ డేట్‌ను వెల్లడించలేదు. ‘మనం ఎప్పుడు వస్తే అప్పుడే అసలైన పండుగ.. త్వరలో చితక్కొట్టేద్దాం’ అని పేర్కొంది.

News January 14, 2025

లాస్ ఏంజెలిస్: మళ్లీ మంటలు.. హెచ్చరికలు

image

లాస్ ఏంజెలిస్ (అమెరికా)కు మరో ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. లాస్ ఏంజెలిస్ తూర్పు ప్రాంతంలోని శాంటా అనా నది పక్కన కొత్తగా మంటలు ప్రారంభమయ్యాయని, భీకర గాలులతో ఇవి వేగంగా విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. జురుపా అవెన్యూ, క్రెస్ట్ అవెన్యూ, బురెన్ ప్రజలు తక్షణం తమ నివాస ప్రాంతాలను వదిలి వెళ్లాలని హెచ్చరించారు. మరోవైపు గాలులతో మంటలు ఆర్పడం ఫైర్ ఫైటర్లకు కష్టంగా మారింది.