News November 26, 2024
నిలకడగా శక్తికాంత దాస్ ఆరోగ్యం
చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆరోగ్య పరిస్థితిపై త్వరలో అప్డేట్ ఇస్తామని RBI వర్గాలు తెలిపాయి. కాగా ఛాతీలో నొప్పితో శక్తికాంత దాస్ ఇవాళ ఉదయం ఆసుపత్రిలో చేరారు.
Similar News
News December 2, 2024
భారీగా మారుతీ సుజుకీ కొత్త డిజైర్ అమ్మకాలు
తమ తాజా కార్ డిజైర్ అమ్మకాలు ఊపందుకున్నాయని మారుతీ సుజుకీ సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు 30వేల బుకింగ్స్ రాగా 5వేల కార్లు డెలివరీ చేసినట్లు తెలిపింది. రోజుకు 1000 బుకింగ్స్ వస్తున్నాయని వెల్లడించింది. మొత్తంగా సంస్థ అమ్మకాల్లో గత ఏడాది నవంబరుతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో 5.33శాతం వృద్ధి నమోదైందని స్పష్టం చేసింది. బలేనో, ఎర్టిగా, ఫ్రాంక్స్, బ్రెజా అధికంగా అమ్ముడవుతున్నాయని పేర్కొంది.
News December 2, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 2, 2024
శుభ ముహూర్తం
తేది: డిసెంబర్ 02, సోమవారం
మార్గశీర్ష శు.పాడ్యమి: మ.12.43 గంటలకు
జ్యేష్ఠ: మ.03.43 గంటలకు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: తె.12.19-1.04 గంటల వరకు,
మ.2.33-3.18 గంటల వరకు