News March 4, 2025
వింత సమస్యతో బాధపడుతున్న హీరోయిన్!

మంచి గుర్తింపు తెచ్చుకున్న పాతతరం హీరోయిన్లలో లైలా ఒకరు. ఇటీవల తనకున్న వింత సమస్య గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ భామ. తాను నవ్వకుండా ఉండలేనని, నవ్వు ఆపేస్తే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయన్నారు. శివపుత్రుడు షూటింగ్ సందర్భంగా విక్రమ్ ఓ నిమిషం పాటు నవ్వకుండా ఉండాలని ఛాలెంజ్ విసరగా, 30సెకన్లకే ఏడ్చేశానని చెప్పుకొచ్చారు. దీంతో మేకప్ అంతా పాడైపోయిందని వివరించారు.
Similar News
News March 20, 2025
వేసవిలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త!

వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు పలు సూచనలు చేశారు. 1. టైర్లలో ఎయిర్ ప్రెషర్‌ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఎందుకంటే వేడికి టైర్లు పేలిపోయే అవకాశం ఉంది. 2. ఇంజిన్ కూలెంట్ స్థాయిని చెక్ చేయండి. అవసరమైతే రీఫిల్ చేయండి. 3. బ్యాటరీ స్థితిని తనిఖీ చేయండి. 4. ఏసీ వ్యవస్థ పనిచేస్తుందో లేదో చూడండి.
* పగటిపూట ప్రయాణాలు మానుకోండి: పోలీసులు
News March 20, 2025
ఒకే ఫ్రేమ్‌లో కెప్టెన్లు

ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆవిష్కరించారు. ఐపీఎల్ ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్లు గ్రూప్ ఫొటో దిగారు. కెప్టెన్లు కమిన్స్, అయ్యర్, గిల్, పంత్, రుతురాజ్, హార్దిక్, పాటిదార్, శాంసన్, రహానే, అక్షర్ పటేల్ ఫొటోషూట్‌లో సందడి చేశారు. కాగా ఎల్లుండి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. 65 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 74 మ్యాచులు జరగనున్నాయి.
News March 20, 2025
చరిత్ర సృష్టించిన ‘ఛావా’

శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ చరిత్ర సృష్టించింది. ‘బుక్ మై షో’లో 12 మిలియన్ టికెట్లు సేల్ అయిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. దేశంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు(రూ.767కోట్లు), విడుదలైన ఐదో వారంలో రూ.22కోట్లు వసూలు చేసిన తొలి మూవీగానూ హిస్టరీ క్రియేట్ చేసింది. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా FEB 14న రిలీజైన విషయం తెలిసిందే.