News January 26, 2025
ఏడాదికే మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్.. కానీ..

నటి శ్వాసికా విజయ్ ఏడాది వ్యవధిలో రెండోసారి పెళ్లి చేసుకున్నారు. అయితే రెండు సార్లూ తన ప్రియుడు ప్రేమ్తోనే కావడం విశేషం. గత ఏడాది జనవరి 26న వారికి కేరళ సంప్రదాయంలో తొలిసారి పెళ్లైంది. అయితే తమిళ సంప్రదాయంలో మరోసారి ఏకమవ్వాలని భావించి వారు తాజాగా పెళ్లి చేసుకున్నారు. శ్వాసిక అసలు పేరు పూజా విజయ్. వైగై అనే తమిళ మూవీతో ఆమె సినిమాల్లోకి వచ్చారు. చివరిగా లబ్బర్ పందూ సినిమాలో నటించారు.
Similar News
News November 24, 2025
నరసరావుపేట: నేతన్నలకు అమలు కానీ ఉచిత విద్యుత్.!

చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రతినెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని సీఎం చంద్రబాబు ఆగస్టు 7న హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి మూడు నెలలు గడిచినా పథకం అమలు కాలేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో కేవలం 280 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి గ్రామాలలో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఈ ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
News November 24, 2025
చెరకు నరికిన తర్వాత ఆలస్యం చేస్తే..

చెరకు నరికిన తర్వాత రోజులు, గంటలు గడుస్తున్నకొద్దీ గడలలోని సుక్రోజ్ శాతం తగ్గుతుంది. ఈ గడలను గానుగాడించకుండా ఉంచితే.. నిల్వ కాలం పెరిగేకొద్దీ బరువు తగ్గుతుంది. చెరకు నరికిన తర్వాత 24 గంటలు ఆలస్యమైతే 1.5%, 48 గంటలు ఆలస్యమైతే 3%, 72 గంటలు ఆలస్యమైతే 5% వరకు దిగుబడిలో నష్టం జరుగుతుంది. అదే విధంగా రసనాణ్యతలోనూ 0.4%-0.6% వరకు క్షీణత కనిపిస్తుంది. నరికిన చెరకును నీడలో ఉంచితే ఈ నష్టం కొంత తగ్గుతుంది.
News November 24, 2025
పిల్లల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా?

ఇదివరకు పిల్లల ఫొటోలు, వీడియోలు కుటుంబం వరకే పరిమితమయ్యేవి. కానీ సోషల్మీడియా వచ్చిన తర్వాత పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ పేరెంట్స్ ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇది సరికాదంటున్నారు నిపుణులు. పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల ఫొటోలు, వివరాలు షేర్ చేయడం వల్ల మార్ఫింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.


