News January 26, 2025

ఏడాదికే మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్.. కానీ..

image

నటి శ్వాసికా విజయ్ ఏడాది వ్యవధిలో రెండోసారి పెళ్లి చేసుకున్నారు. అయితే రెండు సార్లూ తన ప్రియుడు ప్రేమ్‌తోనే కావడం విశేషం. గత ఏడాది జనవరి 26న వారికి కేరళ సంప్రదాయంలో తొలిసారి పెళ్లైంది. అయితే తమిళ సంప్రదాయంలో మరోసారి ఏకమవ్వాలని భావించి వారు తాజాగా పెళ్లి చేసుకున్నారు. శ్వాసిక అసలు పేరు పూజా విజయ్. వైగై అనే తమిళ మూవీతో ఆమె సినిమాల్లోకి వచ్చారు. చివరిగా లబ్బర్ పందూ సినిమాలో నటించారు.

Similar News

News February 12, 2025

ఈ ఏడాదే తల్లికి వందనం, బడ్జెట్‌లో నిధులు: సీఎం

image

AP: ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలు, బడ్జెట్ కూర్పుపై మంత్రి పయ్యావుల, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని తెలిపారు. అలాగే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమతూకంపైనా చర్చిస్తున్నారు.

News February 12, 2025

ఈ కార్లు కొనాలంటే నెలల తరబడి చూడాల్సిందే!

image

మహీంద్రా సంస్థకు కార్ల డెలివరీ చాలా ఆలస్యంగా ఇస్తుందన్న పేరుంది. ఆ సంస్థకు చెందిన థార్ రాక్స్, స్కార్పియో-ఎన్ కార్ల డెలివరీ టైమ్ భారీగా ఉంటోంది. రాక్స్ బుక్ చేశాక దాని తాళాలు తొలిసారిగా చేతికి దక్కాలంటే 18 నెలలు వెయిట్ చేయాల్సిందే. ఇక స్కార్పియో-ఎన్‌కి 2 నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఉత్పత్తిని మరింత వేగవంతం చేయాలన్న డిమాండ్ కస్టమర్స్ నుంచి వ్యక్తమవుతోంది.

News February 12, 2025

ఈనెల 15న ఆటో డ్రైవర్ల రాష్ట్రవ్యాప్త ఆందోళన

image

TG: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు ఆటో డ్రైవర్స్ ఐకాస ప్రకటించింది. కార్మికులకు నెలకు రూ.12వేలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని ఐకాస కన్వీనర్ వెంకటేశం తెలిపారు. సమ్మెకు పిలుపునిస్తే మంత్రి పొన్నం ఇంటికి పిలిపించి మాట్లాడారని, కానీ 4 నెలలైనా పరిష్కారం చూపలేదని వాపోయారు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రూ.10వేల Cr విడుదల చేయాలన్నారు.

error: Content is protected !!