News January 31, 2025
సన్యాసిగా మారిన హీరోయిన్.. ట్విస్ట్

మహా కుంభమేళా వేదికగా <<15247035>>సాధ్విగా<<>> మారిన హీరోయిన్ మమతా కులకర్ణికి ఎదురుదెబ్బ తగిలింది. కిన్నెర అఖాడా నుంచి ఆమెను తొలగిస్తూ ఫౌండర్ రిషి అజయ్ దాస్ ప్రకటన జారీ చేశారు. మమతను సాధ్విగా ప్రకటించిన లక్ష్మీనారాయణ త్రిపాఠిని కూడా తప్పిస్తున్నట్లు తెలిపారు. రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటూ గ్లామర్ ప్రపంచానికి చెందిన వ్యక్తికి ఏకంగా ‘మహామండలేశ్వర్’ స్థానాన్ని కట్టబెట్టడం సనాతన ధర్మానికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
Similar News
News July 11, 2025
NZB: కూలీల కొరత.. పొరుగు రాష్ట్రాల నుంచి బారులు

నిజామాబాద్ జిల్లాలో కూలీల కొరత వేధిస్తోంది. ఇక్కడి వారు ఉపాధి కొసం మలేషియా, కెనడాతో పాటు పలు దేశాలకు వలస వెళ్తున్నారు. దీంతో జిల్లాలో కూలీల కొరత ఏర్పడుతుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులకు జిల్లా రైతులు ఆహ్వానం పలుకుతున్నారు. వరినాట్లు, హమాలీ పనులకు బిహార్, బెంగాల్, మహరాష్ట్ర నుంచి కూలీలు వస్తున్నారు. ఒక ఎకరం వరినాట్లు వేస్తే రూ. 4000 నుంచి రూ. 5000 వరకు కూలీ చెల్లిస్తున్నారు.
News July 11, 2025
ఒక్క సెకన్‌లో నెట్‌ఫ్లిక్స్ డేటా మొత్తం డౌన్‌లోడ్!

జపాన్ మరో సరికొత్త ఆవిష్కరణ చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను సృష్టించింది. సెకనుకు 1.02 పెటా బైట్స్ వేగంతో (పెటా బైట్= 10లక్షల GBలు) ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ వేగంతో ఒక్క సెకనులో నెట్‌ఫ్లిక్స్‌లోని డేటా మొత్తం లేదా 150 GB వీడియో గేమ్స్ డౌన్‌లోడ్ అవుతాయి. ఇది భారత సగటు ఇంటర్నెట్ వేగంతో (63.55 Mbps) పోలిస్తే 16 మిలియన్ రెట్లు వేగవంతమైంది.
News July 11, 2025
తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

* AP: ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న CM చంద్రబాబు
* రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు: హోంమంత్రి అనిత
* శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
* TG: మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ.. దరఖాస్తు తేదీ(ఈ నెల 20-27 వరకు) మార్పు
* కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ఏడుకు చేరిన మరణాలు
* కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు మరోసారి హరీశ్ రావు