News August 30, 2024

చరిత్రలోనే అత్యధిక స్థాయికి సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు

image

సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు చరిత్రలోనే అత్యధికంగా 83వేలకు చేరుకున్నాయి. 2009లో జడ్జిల సంఖ్యను 26 నుంచి 31కు పెంచినా సమస్య తీరలేదు. గత పదేళ్లలో పెండింగ్ కేసులు 8 రెట్లు పెరిగాయి. కొవిడ్‌ ముందు 65వేలుగా ఉన్న ఈ సంఖ్య 2021లో 70వేలు, 2022లో 79వేలకు ఎగిసింది. చివరి రెండేళ్లలో 4000 పెరగడంతో 83వేలకు చేరాయి. ఇందులో 27,604 (33%) ఏడాది క్రితానివే. ఈ సంవత్సరం 38,996 తాజా కేసులు రాగా 37,158 ముగిశాయి.

Similar News

News September 13, 2024

నేడు పిఠాపురానికి వైఎస్ జగన్

image

AP: వరద బాధితులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురం రానున్నారు. నియోజకవర్గంలోని మాధవపురం, రమణక్కపేటలో ప్రజలు, రైతులతో సమావేశమవుతారు. అలాగే ఏలేరు వరద ఉద్ధృతితో అతలాకుతలమై నీటమునిగిన పొలాలను ఆయన పరిశీలిస్తారు. అనంతరం ఆయన తాడేపల్లికి చేరుకుంటారు.

News September 13, 2024

మూత్రం, మురుగు నీటి నుంచి బీర్‌ తయారీ!

image

సింగపూర్‌లో న్యూబ్రూ అనే కంపెనీ బీర్‌ను తయారుచేస్తుంటుంది. ఆ బీర్ రుచి ఇతర కంపెనీల మాదిరిగానే ఉన్నా వాస్తవంగా మూత్రం, మురుగునీటి నుంచి శుద్ధి చేసిన నీటి నుంచి దాన్ని తయారు చేస్తున్నారు. సింగపూర్‌ ప్రభుత్వం దేశ డ్రైనేజీల్ని రీసైకిల్ చేసి ‘నెవాటర్‌’ అనే తాగునీటిని ఉత్పత్తి చేస్తోంది. ఆ నీటినే న్యూబ్రూ వాడుతోంది. తయారీలో అంతర్జాతీయ ప్రమాణాల్ని అనుసరిస్తున్నామని సంస్థ వినియోగదారులకు హామీ ఇస్తోంది.

News September 13, 2024

పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్.. గరిష్ఠంగా రూ.10 వేలే సబ్సిడీ: కేంద్రమంత్రి

image

విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించడం కోసం కేంద్రం PM ఈ-డ్రైవ్ స్కీమ్‌ను తెచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకానికి రూ.10,900 కోట్లు కేటాయించింది. కాగా స్కీమ్ కింద తొలి ఏడాది గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ చెల్లించనున్నట్లు కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. రెండో ఏడాది గరిష్ఠంగా రూ.5వేలు చెల్లిస్తామన్నారు. ఇ-రిక్షాలకు రూ.25 వేలు, రెండో ఏడాది రూ.12,500 అందిస్తామన్నారు.