News April 27, 2024

T20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక రన్ ఛేజ్

image

IPLలో రోజుకొక ప్రపంచ రికార్డు బద్దలవుతోంది. నిన్న KKRపై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి పంజాబ్ చరిత్ర సృష్టించింది. T20 క్రికెట్‌లోనే ఇది అత్యధికం. సెకండ్ ఇన్నింగ్సులో హయ్యెస్ట్ స్కోరు కూడా ఇదే. అత్యధిక రన్స్ ఛేజ్ చేసిన జట్ల(మెన్స్)లో సౌతాఫ్రికా-259(vsవెస్టిండీస్), మిడిలెక్స్-253(vsసర్రే), ఆస్ట్రేలియా-244(vsకివీస్), బల్గేరియా-243(vsసెర్బియా), ముల్తాన్ సుల్తాన్స్-243(vs పెషావర్ జల్మి) ఉన్నాయి.

Similar News

News April 24, 2025

ట్రంప్‌పై కోర్టుకెక్కిన 12 రాష్ట్రాలు!

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ టారిఫ్‌లపై ఆ దేశానికి చెందిన 12 రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించాయి. ‘1977లో చేసిన చట్టం ప్రకారం టారిఫ్‌ను విధించేందుకు అత్యవసర చర్యలు తీసుకునే అధికారం అధ్యక్షుడికి లేదు. చట్టసభకు మాత్రమే ఆ అధికారముంది. ఇష్టారాజ్యంగా టారిఫ్‌లు విధించి అధ్యక్షుడు రాజ్యాంగాన్ని మీరారు. దేశ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలో పడేశారు’ అని తమ దావాలో ప్రభుత్వాలు ఆరోపించాయి.

News April 24, 2025

నేడు శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు విడుదల

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులైకి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. గదుల కోటా బుకింగ్ మ.3 గంటలకు అందుబాటులో ఉంచనుంది. అలాగే మే నెలకు సంబంధించి పద్మావతి అమ్మవారి ఆలయం స్పెషల్ ఎంట్రీ దర్శన్ రూ.200 టికెట్లను కూడా రేపు ఉ. 10 గంటలకు రిలీజ్ చేయనుంది.
వెబ్‌సైట్: <>https://ttdevasthanams.ap.gov.in/<<>>

News April 24, 2025

ఉగ్రదాడిలో హస్తం లేకపోతే పాక్‌కు ఎందుకు ఉలికిపాటు?: మాజీ క్రికెటర్

image

పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ పాత్రపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. ‘ఉగ్రదాడిలో నిజంగా పాకిస్థాన్‌ పాత్ర లేకపోయి ఉంటే ప్రధాని షెహబాజ్ ఇంకా ఎందుకు ఖండించలేదు? బలగాలెందుకు హై అలర్ట్‌లో ఉన్నాయి? ఎందుకంటే ఉగ్రవాదులకు నిలయంగా వారిని పెంచి పోషిస్తున్నామని పాక్‌కూ తెలుసు. సిగ్గు పడాలి’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!