News March 6, 2025
ఇవాళ అత్యధికంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత

AP: రాష్ట్రంలో సూర్యుడు భగ్గుమన్నాడు. ఇవాళ అనకాపల్లి జిల్లా నాతవరం, తూ.గో. జిల్లా గోకవరం, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో అత్యధికంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 7 మండలాల్లో తీవ్ర, 68 మండలాల్లో వడగాల్పులు వీచాయని APSDMA పేర్కొంది. శుక్రవారం 84 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది.
Similar News
News March 21, 2025
మెగాస్టార్ చిరంజీవికి సీఎం రేవంత్ అభినందనలు

TG: UKలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని CM రేవంత్ అభినందించారు. ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు చిరంజీవిగారికి హృదయపూర్వక అభినందనలు. మీకు లభించిన ఈ గౌరవం తెలుగుజాతికి గర్వకారణం. భవిష్యత్తులో మీరు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్ఠలను విశ్వవేదికపై చాటిచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
News March 21, 2025
ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258కోట్లు

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చును కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ప్రధాని పర్యటనల ఖర్చును తెలపాలని కోరగా విదేశాంగ శాఖ బదులిచ్చింది. 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు చేయగా రూ. 258కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. 2023 జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనకు అధికంగా రూ.22కోట్లు ఖర్చు జరిగినట్లు తెలిపింది.
News March 21, 2025
మార్చి21: చరిత్రలో ఈరోజు

*1916: సెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం *1933: పేరిణి శివతాండవ నాట్యచారుడు నటరాజ రామకృష్ణ జననం *1970: హీరోయిన్ శోభన జననం *1978: ప్రముఖ సినీనటి రాణి ముఖర్జీ జననం
ప్రపంచ అటవీ దినోత్సవం
ప్రపంచ కవితా దినోత్సవం
ప్రపంచ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం