News January 22, 2025

రంజీ జెర్సీలో మెరిసిన హిట్ మ్యాన్

image

ముంబై తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు రోహిత్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి జమ్మూ‌కశ్మీర్‌తో జరగనున్న రంజీ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న హిట్‌మ్యాన్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ రంజీ జెర్సీలో మెరిశారు. కొత్త జెర్సీలో ఫేవరెట్ క్రికెటర్‌ను చూసిన ఫ్యాన్స్ రంజీల్లోనూ అదరగొట్టాలని పోస్టులు పెడుతున్నారు. ముంబై జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News December 4, 2025

ADB: సీఎం పర్యటన.. ఎన్నికల స్టంట్ ఏనా..?

image

పంచాయతీ ఎన్నికల సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించి జిల్లాకు వస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాకు వచ్చి ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అందుకే పట్టణంలో ఎన్నికల నియమావళి ఉండదని అక్కడ సీఎం సభ పెట్టారని మండిపడుతున్నారు.

News December 4, 2025

HYD: మరిన్ని మహిళా క్యాంటీన్లు రానున్నాయి!

image

HYD, మేడ్చల్, RR జిల్లాల పరిధి రద్దీ ప్రాంతాలు బస్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు, ఆస్పత్రులు జిల్లా కోర్టుల ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా మహిళలకు ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇవి కొనసాగుతున్నాయి. వీటిద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తుండగా, మరికొంత మందికి లబ్ధి చేకూరనుంది.

News December 4, 2025

ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఫేక్: పోలీసులు

image

TG: డిసెంబర్ 13న ట్రాఫిక్ చలాన్లపై 100% వరకు తగ్గింపు అంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని హైదరాబాద్ సిటీ పోలీసులు Xలో స్పష్టం చేశారు. ఇప్పటివరకు అలాంటి ప్రకటన ఏమీ చేయలేదని తెలిపారు. అనధికారిక సమాచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు. ఎల్లప్పుడూ పోలీస్ హ్యాండిల్స్‌ను చెక్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా పలు రాష్ట్రాల్లో అదే రోజున లోక్ అదాలత్ నిర్వహిస్తుండడంతో ఈ ప్రచారం జరిగినట్లు తెలుస్తోంది.