News March 11, 2025
ఇక సెలవు.. ముగిసిన గరిమెళ్ల అంత్యక్రియలు

AP: ప్రముఖ సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్(76) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశానవాటికలో ఆయనకు కుమారులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గరిమెళ్ల ఆదివారం గుండెపోటుతో చనిపోగా, ఆయన ఇద్దరు కుమారులు నేడు అమెరికా నుంచి తిరుపతి చేరుకొని అంత్యక్రియలు పూర్తి చేశారు. TTD ఆస్థాన గాయకుడిగా గరిమెళ్ల ఎన్నో అన్నమయ్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 19, 2025
ఫోన్ ట్యాపింగ్.. వారిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపై CBI నుంచి రాష్ట్ర సీఐడీకి సమాచారం వచ్చింది. వారిద్దరినీ వీలైనంత త్వరగా మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.
News March 19, 2025
BYD సంచలనం.. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 470 కి.మీ

చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ BYD సంచలనం సృష్టించింది. కేవలం 5-8 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే కారు దాదాపు 470 కి.మీ వెళ్తుందని ఆ కంపెనీ ప్రకటించింది. చైనావ్యాప్తంగా 4వేల అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించబోతున్నామని తెలిపింది. దీంతో టెస్లా, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలకు గట్టి సవాల్ ఎదురుకానుంది.
News March 19, 2025
చేనేత కార్మికులకు అవార్డులు.. దరఖాస్తు ఇలా

TG: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ పేరుతో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 నాటికి చేనేతలుగా 30yrs వయసు, పదేళ్ల అనుభవం, చేనేత డిజైనర్లుగా 25yrs వయసు, ఐదేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. ఏప్రిల్ 15లోగా ఆయా జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులకు దరఖాస్తులను సమర్పించాలి. పూర్తి వివరాలకు https://handtex.telangana.gov.in/ చూడండి.