News June 14, 2024

వ్యక్తిని కొట్టి చంపిన ఘటన.. ఎస్సై సస్పెన్షన్

image

TG: నారాయణపేట్ జిల్లా ఉట్కూర్ ఎస్సై శ్రీనివాసులను ఎస్పీ యోగేశ్ గౌతమ్ సస్పెండ్ చేశారు. బాధితులు ఫిర్యాదు చేసిన తక్షణమే స్పందించకపోవడంతో ఎస్సైపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఉట్కూరు మండలం చిన్నపొర్లలో భూతగాదాలతో సంజీవ్ అనే వ్యక్తిని ప్రత్యర్థులు కొట్టి <<13438774>>చంపారు<<>>. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయ్యారు.

Similar News

News September 13, 2025

రేపే దాయాదుల పోరు.. సగం టికెట్లే సేల్!

image

UAEలో జరుగుతోన్న ఆసియా కప్‌పై భారత అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ముఖ్యంగా రేపు జరిగే ఇండియా VS పాకిస్థాన్‌ను బైకాట్ చేయాలంటూ భారత అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీంతో హాట్ కేకుల్లా అమ్ముడవ్వాల్సిన దాయాదుల మ్యాచ్ టికెట్లు ఇప్పటికీ సగం కూడా అమ్ముడవలేదని సమాచారం. అమ్మకాలను పెంచేందుకు నిర్వాహకులు టికెట్ ధరలు కూడా తగ్గించారట. రోహిత్, కోహ్లీ వంటి స్టార్లు లేకపోవడం మరో కారణంగా తెలుస్తోంది.

News September 13, 2025

నిద్రలోనే చనిపోయిన 19 మంది స్టూడెంట్స్

image

మయన్మార్‌లో అంతర్గత ఘర్షణలకు 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి రఖై రాష్ట్రంలోని క్యాక్తాలో రెండు ప్రైవేట్ స్కూళ్ల‌పై డ్రోన్ల దాడి జరగడంతో 19 మంది స్టూడెంట్స్ నిద్రలోనే కన్నుమూశారు. 22 మంది గాయపడినట్లు అరాకన్ ఆర్మీ తెలిపింది. డ్రోన్లతో బాంబులను జారవిడిచారని, ఇది మయన్మార్ మిలిటరీ పనేనని ఆరోపించింది. కాగా కొన్నాళ్లుగా అరాకన్ ఆర్మీ, మయన్మార్ మిలిటరీ మధ్య ఘర్షణ జరుగుతోంది.

News September 13, 2025

‘నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా.. నగరాజ ధరుడా శ్రీనారాయణా’ అంటే అర్థమేంటి?

image

అన్నమయ్య రచించిన ఓ ప్రముఖ కీర్తనలోని ఈ పంక్తులకు.. ‘వేదాలు(నిగమ), ఉపనిషత్తుల(నిగమాంత) ద్వారా వర్ణించబడిన అత్యంత మనోహరమైన రూపాన్ని కలిగి ఉన్నవాడా, ఓ శ్రీ నారాయణా! నీవు గొప్ప పర్వతాలు మోసినవాడవు(నగరాజ ధరుడా!)’ అనే అర్థం వస్తుంది. శ్రీమహావిష్ణువు కృష్ణుడి అవతారంలో గోవర్ధన గిరిని, క్షీరసాగర మథన సమయంలో కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోశాడు. అలా నగరాజ ధరుడిగా ఆయణ్ను కొలుస్తారు.