News September 29, 2024

ఆ స‌మాచారం ఇచ్చింది ఇరాన్ గూఢ‌చారి!

image

హెజ్బొల్లా చీఫ్ న‌స్ర‌ల్లా జాడ‌ను ప‌సిగ‌ట్ట‌డానికి ఇరాన్ గూఢ‌చారి సాయాన్ని ఇజ్రాయెల్ తీసుకున్న‌ట్టు ఫ్రెంచ్ పత్రిక తెలిపింది. ఓ స‌మావేశంలో పాల్గొనేందుకు బీరూట్‌ ద‌క్షిణ శివారులోని హెజ్బొల్లా భూగ‌ర్భ ఆఫీసుకు నస్రల్లా చేరుకున్నారు. ఈ స‌మాచారాన్ని ఇరాన్ గూఢ‌చారి ఇజ్రాయెల్‌కు చేర‌వేసినట్టు పేర్కొంది. స‌మాచారాన్ని ధ్రువీక‌రించుకున్న ఇజ్రాయెల్ గంటల వ్యవధిలోనే బీరూట్‌పై దండెత్తి నస్రల్లాను హతమార్చింది.

Similar News

News October 5, 2024

హర్షసాయి‌పై లుక్‌అవుట్ నోటీసులు

image

TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం HYD నార్సింగి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బు కూడా తీసుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 5, 2024

రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి?

image

ఏదైనా ప్రాజెక్టుకు ఖరారైన కాంట్రాక్ట్‌కు మళ్లీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. మొదటిసారి పిలిచిన టెండర్లలో అవకతవకలు జరగడం లేదా ఆ పనిని మరింత చౌకగా చేయడానికి అవకాశం ఉందని తేలితే రివర్స్ టెండరింగ్‌కు పిలుస్తారు. జాతీయ స్థాయిలో NTPC, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ అమలు చేస్తున్న ఈ విధానాన్ని YCP ప్రభుత్వం తొలిసారి ఏపీలో తీసుకొచ్చింది. దాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది.

News October 5, 2024

TTDలో రివర్స్ టెండరింగ్ రద్దు

image

AP: TTDలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ EO శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. దీంతో పాత పద్ధతిలోనే టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. అన్ని రకాల పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను NDA ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ తదితర సంస్థలు అమలుచేస్తున్న ఈ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.