News November 25, 2024
తొలి రోజు ముగిసిన ఐపీఎల్ వేలం
ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు ముగిసింది. రేపు కూడా ఆక్షన్ కొనసాగనుంది. ఐపీఎల్ చరిత్రలోనే వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా రిషభ్ పంత్(రూ.27 కోట్లు-LSG) నిలిచారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(రూ.26.75కోట్లు-PBKS) నిలిచారు. మొత్తం 72 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. ఇంకా డుప్లెసిస్, విలియమ్సన్, సామ్ కరన్, భువనేశ్వర్, సుందర్, డేవిడ్ వంటి ప్లేయర్ల భవితవ్యం రేపు తేలనుంది.
Similar News
News December 11, 2024
హిందువులు సహా మైనారిటీలపై 88 దాడులు: బంగ్లాదేశ్
హిందువులు సహా మైనారిటీలపై మత హింస కేసుల వివరాలను బంగ్లాదేశ్ వెల్లడించింది. ఆగస్టులో షేక్ హసీనా వెళ్లినప్పటి నుంచి 88 హింసాత్మక ఘటనలు జరిగాయంది. ఈ కేసుల్లో 70 మందిని అరెస్టు చేసినట్టు యూనస్ ప్రెస్ సెక్రటరీ ఆలమ్ తెలిపారు. సునమ్ గంజ్, గాజీపూర్, ఇతర ప్రాంతాల దాడుల్లో అరెస్టులు కొనసాగుతాయన్నారు. దాడులపై ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ ఆందోళన వ్యక్తంచేసిన మరుసటి రోజే వివరాలు వెల్లడించడం గమనార్హం.
News December 11, 2024
నేడు ఆ ల్యాండ్ మార్క్ దాటనున్న పుష్ప-2?
పుష్ప-2 విడుదలైన 5 రోజుల్లో(నిన్నటి వరకు) రూ.922 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. బాక్సాఫీస్ ట్రాకింగ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ ప్రకారం మూవీ నిన్న రూ.52.50 కోట్లు వసూలు చేసింది. ఆ ట్రెండ్ కొనసాగితే ఈరోజు ముగిసేసరికి ఆ మూవీ గ్రాస్ రూ.1000 కోట్లు దాటేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే విడుదలైన వారంలోనే ఆ ఘనత సాధించిన తొలి భారత సినిమాగా పుష్ప-2 రికార్డు సృష్టిస్తుంది.
News December 11, 2024
మహ్మద్ షమీ ఆసీస్ టూర్ క్యాన్సిల్?
టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఆయన 5 రోజుల మ్యాచ్ ఆడేంత ఫిట్‌నెస్ సాధించలేదని, అందుకే ఈ టూర్‌ను రద్దు చేసుకున్నట్లు సమాచారం. SMATలో భాగంగా బరోడాతో జరగబోయే క్వార్టర్ ఫైనల్లో ఆయన ఆడతారని తెలుస్తోంది. ఇందులో ఆయన ఫిట్‌నెస్‌ను మరోసారి పరీక్షిస్తారని సమాచారం. కాగా చివరి మూడు టెస్టుల కోసం షమీ ఆసీస్ వెళ్తారని ఇప్పటివరకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.