News March 11, 2025
మొదలైన ఐపీఎల్ సందడి

ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో దేశంలో IPL ఫీవర్ ప్రారంభమైంది. ఆయా జట్ల ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే తమ జట్లతో చేరుతున్నారు. RCB కెప్టెన్ రజత్ పాటిదార్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ టీమ్తో జతకలిశారు. కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ (RCB), నోకియా, డికాక్, రమణ్దీప్ సింగ్ (KKR) తదితరులు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలెట్టారు. ఈ నెల 22 నుంచి క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది.
Similar News
News November 22, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA తెలిపింది. ఇది సోమవారానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని పేర్కొంది. దీంతో రేపు ప్రకాశం, NLR, KDP, అన్నమయ్య, CTR, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. వరి కోతల టైం కావడంతో ధాన్యం కుప్పలు వేసుకోవాలని, రంగుమారకుండా ఉండేందుకు టార్పాలిన్లతో కప్పి ఉంచాలని రైతులకు సూచించింది.
News November 22, 2025
యాషెస్ టెస్టు.. 847 బంతుల్లోనే ముగిసింది

యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు 847 బంతుల్లోనే ముగిసింది. 20వ శతాబ్దం మొదలైన తర్వాత అతి తక్కువ బంతుల్లో ముగిసిన యాషెస్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. 1895లో సిడ్నీలో జరిగిన మ్యాచ్ 911 బంతుల్లో ముగిసింది. అటు తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు 405 బంతులే(67.3 ఓవర్లు) ఎదుర్కొన్నారు. 1904 తర్వాత ఇంత తక్కువ ఓవర్లలో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్సులను ముగించడం ఇదే తొలిసారి.
News November 22, 2025
నాన్న 50ఏళ్లు ఇండస్ట్రీని తన భుజాలపై మోశారు: విష్ణు

తెలుగు సినిమా పరిశ్రమలో మంచు మోహన్ బాబు 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్ చేశారు. ’94 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమను 50 ఏళ్లు మా నాన్న తన భుజాలపై మోశారు. ఆయన అసాధారణ ప్రయాణాన్ని చూడగలిగినందుకు ఎంతో గర్వంగా ఉంది. 50 లెజెండరీ ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు నాన్న’ అని ట్వీట్ చేశారు. ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే.


