News May 10, 2024
డబ్బుల జమ వ్యవహారం.. ప్రభుత్వంపై ఈసీ ప్రశ్నల వర్షం

AP: డబ్బుల జమ పథకాలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి EC లేఖ రాసింది. ‘బటన్ నొక్కి చాలా రోజులైంది. ఈరోజే నగదు బదిలీ చేయకపోతే ఏమవుతుంది? జనవరి 24 నుంచి మార్చి 24వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలియజేయండి. ఇప్పటివరకు ఎందుకు జమ చేయలేకపోయారు. ఈ ఐదేళ్లలో బటన్ నొక్కిన సమయానికి, నిధుల బదిలీకి మధ్య వ్యవధి ఎంత? పోలింగ్ తేదీకి ముందే ఎందుకు జమ చేయాలనుకుంటున్నారు?’ అంటూ EC ప్రశ్నల వర్షం కురిపించింది.
Similar News
News February 15, 2025
GOOD NEWS: పప్పుల రేట్లు తగ్గాయ్

TG: భారీగా పెరిగిన పప్పుల ధరలు దిగొస్తున్నాయి. గతేడాది రూ.200-240 వరకు వెళ్లిన క్వాలిటీ కేజీ కందిపప్పు ప్రస్తుతం రూ.150-160కి వచ్చింది. క్వాలిటీ తక్కువుండే పప్పు రూ.110-125 పలుకుతోంది. శనగ పప్పు రూ.150 నుంచి రూ.135కు, మినప పప్పు రూ.160 నుంచి రూ.150కి, మైసూర్ పప్పు రూ.130 నుంచి రూ.115కి తగ్గింది. రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు, మార్కెట్లకు సరఫరా పెరగడమే ధరల తగ్గుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
News February 15, 2025
బర్డ్ ఫ్లూ.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి!

AP: బర్డ్ ఫ్లూతో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌కు సంబంధించి ప్రజలు, కోళ్ల పెంపకందారుల సందేహాలు తీర్చేందుకు పశుసంవర్ధక శాఖ టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. ఎవరికైనా సందేహాలుంటే ఉ.6 నుంచి రా.9 గంటల మధ్య 0866 2472543, 9491168699 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
News February 15, 2025
లోన్ కట్టలేదని గేటు ఊడదీసుకుపోవడం ఏంటి?: తుమ్మల

TG: లోన్ చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఓ రైతు ఇంటి గేటు తీసుకెళ్లిన <<15446915>>ఘటనపై<<>> వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్పందించారు. అప్పులు చెల్లించని డిఫాల్టర్లకు బ్యాంకులు రూ.కోట్లతో రుణాలు ఇస్తున్నాయని, రైతులు సకాలంలో లోన్ కట్టకపోతే గేటు ఊడదీసుకుపోవడం ఏంటని ప్రశ్నించారు. మానవీయ కోణంలో వ్యవహరించాలని నాబార్డు రుణ ప్రణాళిక సదస్సులో ఆయన సూచించారు. అన్నదాతలకు రుణాలు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం తగదన్నారు.