News August 22, 2024
ఏపీలో వాలంటీర్ల కీలక నిర్ణయం!

AP: ఉద్యోగ భద్రతపై ఆందోళనలో ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లు ఉద్యమానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెండింగ్ బకాయిలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన రూ.10,000 గౌరవ వేతనం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో దానిపై నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల 31న విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ ప్రణాళిక రూపొందించాలని భావిస్తున్నారు.
Similar News
News July 10, 2025
అనుమతి లేకుండా ఇతరుల ఫొటోలు షేర్ చేస్తున్నారా?

బెంగళూరులో అనుమతి లేకుండా యువతి వీడియోను తీసి SMలో షేర్ చేసిన 26 ఏళ్ల యువకుడు అరెస్టయ్యాడు. యువతి ఫొటోలు, వీడియోలు అసభ్య కామెంట్లతో వైరలవ్వగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66E ప్రకారం ఇతరుల ఫొటోలను SMలో వారి అనుమతి లేకుండా షేర్ చేయడం నేరం. దీని ప్రకారం గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
News July 10, 2025
రైతులు మీకు దొంగలు, రౌడీలుగా కనిపిస్తున్నారా?: జగన్

AP: మామిడి రైతులు సీఎం చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కళ్లకు దొంగలు, రౌడీల్లాగా కనిపిస్తున్నారా? అని మాజీ CM జగన్ మండిపడ్డారు. రైతులకు అండగా నిలవకపోగా వారిపై వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాబు పాలకుడు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. 76 వేల రైతు కుటుంబాల సమస్యను గాలికొదిలేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని రైతులకు అండగా నిలబడండి’ అంటూ ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు.
News July 10, 2025
ప్రేమ పెళ్లి.. వరుడికి 79, వధువుకు 75 ఏళ్లు

ప్రేమకు వయసుతో సంబంధం లేదని కేరళకు చెందిన ఓ వృద్ధ జంట నిరూపించింది. రామవర్మపురంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో 79 ఏళ్ల విజయ రాఘవన్, 75 ఏళ్ల సులోచన మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక్కటయ్యారు. వీరి వివాహానికి ఆ రాష్ట్ర మంత్రి ఆర్.బిందు, సిటీ మేయర్ వర్గీస్, అధికారులు హాజరయ్యారు.